ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బస్సు లోయలో పడిన ఘటనలో 42 మంది దుర్మరణం పాలయ్యారు.. 45 మంది ప్రయాణికులతో రామ్‌నగర్ నుంచి భోహన్‌కు బయల్దేరిన బస్సు.. పౌరిగల్వార్ జిల్లా నానిదండ వద్ద అదుపుతప్పి లోయలో పడింది.. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా 42 మంది ప్రయాణికులు దుర్మరణం పాలవ్వగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను వెలికితీసి గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.