ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ లారీని ఢికొట్టింది. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో 42 మంది గాయపడ్డారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఆదివారం ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు నలుగురు మరణించారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు. అయితే ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపట్టారు.

బెంగళూరులో వివాహిత అనుమానస్పద మృతి.. స్కూల్ ఫంక్షన్‌కి వెళ్లొద్దని గొడవ.. భర్తపైనే అనుమానాలు..!

ఇటావా అడ్మినిస్ట్రేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. స్లీపర్ బస్సు 46 మంది ప్రయాణికులతో గోరఖ్‌పూర్ నుండి అజ్మీర్ షరీఫ్‌కు వెళుతోంది. ఆ బస్సు సైఫాయ్ సమీపంలో ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉండగా డ్రైవర్ నిద్రపోయాడు. దీంతో వాహనం నియంత్రణ కోల్పోయింది. దీంతో ముందు ఇసుక లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టింది. 

ప్రమాదంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ప్రయాణికులను బస్సులో నుంచి బయటకు తీశారు. సైఫాయ్‌లోని పీజీఐ హాస్పిటల్ కు తరలించారు. బస్సులో ఉన్న 42 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

Scroll to load tweet…

ప్రమాదం అనంతరం ఇటావా డీఎం అవ్నీష్ కుమార్ రాయ్, ఎస్‌ఎస్పీ ఇటావా జైప్రకాష్ సింగ్, డిప్యూటీ డీఎం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీరును పరిశీలించారు. అనంతరం సైఫాయిలోని పీజీఐ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సంబంధిత అధికారులు, పీజీఐ వైద్యులను ఆదేశించారు.

స్నేహితుడిపై దాడి చేసి.. మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 10 మంది సామూహిక అత్యాచారం..

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లో రేవా జిల్లాలో శుక్రవారం రాత్రి ఇలాంటి ప్రమాదమే జరిగింది. రేవా జిల్లాలో 30వ నెంబరు జాతీయ రహదారిపై చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో దాదాపు 15 మంది చనిపోయారు. మరో 35 మందికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించి, ధ్వంసమైన బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి అంబులెన్స్‌లను పిలిపించారు. గాయపడిన ప్రయాణికులను చికిత్స కోసం టీంథర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. 

నిశ్చింతగా దీపావళి జరుపుకోండి.. బార్డర్ లో అప్రమత్తంగా ఉన్నాం - దేశ ప్రజలకు ఇండియన్ ఆర్మీ పండుగ శుభాకాంక్షలు

ఈ ఘటనపై ఆ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రయాణికులతో నిండిన బస్సు పర్వత రహదారిపై బోల్తా పడిందని ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు జబల్‌పూర్‌ నుంచి రేవా మీదుగా ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తోందని పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.