Asianet News TeluguAsianet News Telugu

నిశ్చింతగా దీపావళి జరుపుకోండి.. బార్డర్ లో అప్రమత్తంగా ఉన్నాం - దేశ ప్రజలకు ఇండియన్ ఆర్మీ పండుగ శుభాకాంక్షలు

ఇండియన్ ఆర్మీ జవాన్లు శనివారం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి దీపాలు వెలిగించి, టపాసులు పేల్చాారు. దేశ ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. 

Celebrate Diwali with confidence.. Vigilant at the border - Happy Indian Army festival to the people of the country
Author
First Published Oct 23, 2022, 8:59 AM IST

దేశమంతా దీపావళి పండుగను జరుపుకోవడానికి సిద్ధం అవుతుండగా.. మన భారత సైనిక సైనికులు కూడా నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద పండగ ఉత్సవాలను ప్రారంభించారు. నియంత్రణ రేఖ వెంబడి సైనికులు నిలబడి  దీపాలు వెలిగించి, టపాసులు పేల్చారు. ధంతేరాస్ కు గుర్తుగా భారత సైనికులు లక్ష్మీ గణేష్ హారతి పాడుతూ లక్ష్మీ పూజ చేశారు. 

ఈ వేడకుల సందర్భంగా సైనికాధికారులు మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలకు దీపావళి పండగ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయులు ఆందోళన చెందవద్దని కోరారు. తాము సరిహద్దులను సంరక్షిస్తున్నామని, నిశ్చితంగా కుటుంబాలతో పండుగను జరుపుకోవాలని కోరారు. ‘‘ ఆందోళన చెందవద్దని, పండుగను పూర్తి ఆనందంతో జరుపుకోవద్దని నేను దేశప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. దేశప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన సైనికులు అప్రమత్తంగా ఉన్నారు. సరిహద్దుల్లో నిఘా ఉంచుతున్నారు. ’’ అని కల్నల్ ఇక్బాల్ సింగ్ అన్నారు.

భారత సైనికులతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ..
ప్రధాని నరేంద్ర మోడీ భారత సైనికులతో దీపావళి వేడుకను జరుపుకునే అవకాశం ఉంది. ముందుగానే జవాన్లతో వేడుకల జరపుకోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. భద్రతా కారణాల వల్ల ఖచ్చితమైన స్థావరాన్ని వెల్లడించలేదు. అయితే గత ఏడాది కూడా జవానులతో కలిసి దీపావళిని జరుపుకోవడానికి ప్రధాని జమ్మూ కాశ్మీర్ లోని నౌషెరాకు చేరుకున్నారు. 

భార్యాభర్తల చికెన్ గొడవ ... తలదూర్చిన పక్కింటాయన దారుణ హత్య

ఈ సందర్భంగా ప్రధాని మోడీ సైనికులకు స్వీట్లు పంచిపెట్టారు. దీపాలు వెలిగించారు. పండుగకు గుర్తుగా టపాసులు పేల్చారు. 2014లో ప్రధాని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలోని వివిధ సరిహద్దుల్లో భారత సైన్యంతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios