ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 షేర్ మార్కెట్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ బడ్జెట్ లో వృద్ధి, వినియోగం, మధ్యతరగతి వారికి పన్ను ఉపశమనం వంటి అంశాలపై ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. దీనివల్ల చాలా షేర్లలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి.
Budget 2025 Live updates: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు, అంచనాలు

Budget 2025కి సంబంధించిన లైవ్ అప్ డేట్స్ పేజీ ఇది. ఇక్కడ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం, బడ్జెట్ హైలైట్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేటాయించిన నిధులు, ఆదాయ పన్ను, సామాన్యుని అంచనాలు అన్నీ ఒకే చోట తెలుసుకోవచ్చు.
Budget 2025 : షేర్ మార్కెట్ పై బడ్జెట్ ఎఫెక్ట్
నిర్మలా సీతారామన్ చీరల సెలక్షన్ ఎంత సూపరో..!
నిర్మలా సీతారామన్ చీరల సెలక్షన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమావేశంలో కట్టుకున్న చీరలు హైలైట్ అవుతుంటాయి. నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలకు, బడ్జెకు లింక్ పెడుతుంటారు. కానీ నిర్మలా సీతారామన్ కట్టుకున్న చీరలు అందంగా, చూడముచ్చటాగా ఉంటాయి. ఇలాంటి చీరలను మీరు ఎన్నో ఫంక్షన్లకు కూడా కట్టుకెళ్లొచ్చు తెలుసా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
Budget 2025: బొమ్మల్లో బడ్జెట్ గురించి చెబితే ఇలా ఉంటుంది
బడ్జెట్ ని బొమ్మల్లో చెబితే ఇలా ఉంటుంది!
1️⃣ Budget ప్లానింగ్
🏛️📅➡️📊💰
2️⃣ రెవెన్యూ / ఆదాయ వనరులు
💰📥 = 👨💼💵 + 🏢💵 + 🛒💵 + 🌍💵
(Taxes from salaries, businesses, shopping, and international trade)
3️⃣ ప్రభుత్వ ఖర్చులు
📤💰➡️🏗️🛣️🏥🏫 + 🍚🎓💊💡 + 🛰️⚔️👮♂️🚆
(Spending on infrastructure, public welfare, and security)
4️⃣ Budget లెక్కలు
📥💰➖📤💰 = 📊⚖️ (✅ మిగులు / ❌ లోటు)
5️⃣ Budget ప్రకటన & ఆమోదం
📢📜➡️🏛️🗣️✅❌
(బడ్జెట్ సమర్పణ, పార్లమెంట్ లో చర్చ, ఆమోదం లేదా తిరస్కరణ)
6️⃣ ప్రజలపై ప్రభావం
✅📜➡️📅💰📤➡️🧑🤝🧑🎉/😟
(ఆమోదం పొందితే, ప్రజల కోసం ఖర్చు చేస్తారు. ఒక్కోసారి ప్రజలకు భారం కావొచ్చు.)
📈📉➡️🌍💬➡️💰💹📉📈
(Budget economy, markets, ఆర్థిక స్థిరత్వానని ప్రభావితం చేస్తుంది.)
Budget 2025: ఇవేం పన్నులండీ బాబూ
విచిత్రమైన పన్నులు
- బ్రహ్మచారులపై పన్ను 🏛️
1695లో జూలియస్ సీజర్ ఇంగ్లాండ్‌లో, 1702లో పీటర్ ది గ్రేట్ రష్యాలో, 1924లో ముస్సోలినీ ఇటలీలో బ్రహ్మచారులపై పన్ను విధించారు. అమెరికాలోని మిస్సోరీలో ఇప్పటికీ 💰1 డాలర్ పన్ను ఉంది.
- వ్యభిచారంపై పన్ను 💃
జర్మనీలో వ్యభిచారం చట్టబద్ధమైన వృత్తి. దీంతో ఇక్కడ 2004 నుండి వేశ్యలు ప్రతి నెల 💶150 యూరోలు పన్ను చెల్లించాలి. జర్మన్ ప్రభుత్వానికి సంవత్సరానికి 💵1 మిలియన్ యూరోలు వస్తాయి.
- కార్డుల కొనుగోలు, అమ్మకంపై పన్ను 🃏
అమెరికాలోని అలబామాలో కార్డుల కొనుగోలు, అమ్మకంపై పన్నులుంటాయి. కొనుగోలుదారుడు 10% డెక్, అమ్మకందారుడు ₹💵71 చెల్లించాలి.
- టాయిలెట్ ఫ్లష్ చేయడంపై పన్ను 🚽
USలోని మేరీల్యాండ్‌లో ప్రతి ఇంటి నుండి టాయిలెట్ ఫ్లష్ పన్ను వసూలు చేస్తారు. నీటి వినియోగాన్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రతి నెల 💧5 డాలర్ల టాయిలెట్ ఫ్లష్ పన్ను వసూలు చేస్తుంది.
- టాటూ వేయించుకోవడంపై పన్ను 🎨
అమెరికాలోని ఆర్కాన్సాస్ రాష్ట్రంలో టాటూ వేయించుకోవడం, బాడీ పియర్సింగ్ లేదా ఎలక్ట్రోలిసిస్ చికిత్స చేయించుకుంటే అమ్మకపు పన్ను కింద 💲6% పన్ను చెల్లించాలి.
- ఆహారంలో కొవ్వుపై పన్ను 🍔
డెన్మార్క్-హంగరీ వంటి దేశాలు చీజ్, వెన్న, పేస్ట్రీ వంటి అధిక కేలరీల ఆహారాలపై కొవ్వు పన్ను విధిస్తాయి. 2.3% కంటే ఎక్కువ సంతృప్త కొవ్వు ఉన్న అన్ని ఆహారాలు దీని పరిధిలోకి వస్తాయి.
- జంతువుల త్రేనుపుపై పన్ను 🐄
న్యూజిలాండ్‌లో పశువుల త్రేనుపుపై పన్ను ఉంటుంది. 🌍 గ్రీన్‌హౌస్ వాయువుల సమస్యను నివారించడానికి ఇలా చేస్తారు.
- పెంపుడు జంతువులపై పన్ను 🐶
భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వింతైన పన్నులు ఉన్నాయి. నివేదికల ప్రకారం, 2017 చివరిలో పంజాబ్ ప్రభుత్వం పెంపుడు జంతువులపై పన్ను విధించింది. 🏠🐾
బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే అందులో వాడే పదాలకు అర్థం తెలియాలి
Union Budget 2025 : బడ్జెట్ అంటేనే అంకెల గారడి. కాబట్టి చాలామంది విద్యార్థులకు మ్యాథమెటిక్స్ అర్థం కానట్లే బాగా చదువుకుని కూడా ఆర్థిక అంశాలపై అవగాహన లేనివారికి బడ్జెట్ లో వాడే పదాలు అర్థం కావు. ఇక సామాన్య ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బడ్జెట్ లో ప్రతి అంశం ప్రతి ఒక్కరికి తెలిసిందే వుంటుంది... కానీ పదాలు ఆర్థికశాస్త్ర పరిబాషలో వుండటంతో అర్ధం కావు. కాబట్టి బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే ముందు అందులో వాడే పదాలకు అర్థం తెలిసుండాలి. బడ్జెట్ ను అర్థం చేసుకోవాలంటే ఇది ఎంతో ముఖ్యం. పదాలకు సంబంధించిన పూర్తి కథనం ఇక్కడ చదవండి
తాత, తల్లి, మనవడు.. ఇలా మూడు తరాల బడ్జెట్
Budget 2025 : నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి దేశ బడ్జెట్ ను ప్రవేశపెడుతూ అరుదైన ఘనత సాధించబోతున్నారు. అయితే తాత, తల్లి, మనవడు...ఇలా ఒకే కుటుంబంనుండి ముగ్గురికి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం వచ్చింది. ఈ ఘనత సాధించిన ఆ కుటుంబమేదో తెలుసా? తెలియాలంటే ఈ కథనం చదవండి.
Budget 2025 : నిర్మలా సీతారామన్ బడ్జెట్ డే ఇలా గడుస్తుంది.
శనివారం ఉదయం 8.40 గంటలకు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన నివాసం నుండి ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బయలుదేరుతారు. ఉదయం 9 గంటలకు ఆమె తన బడ్జెట్ బృందంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ వెలుపల ఫోటో సెషన్‌లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆమె బడ్జెట్‌పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం పొందడానికి బయలుదేరుతారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి పార్లమెంట్ లో జరిగే కేబినెట్ బేటీలో పాల్గొని బడ్జెట్ 2025 ఆమోదం పొందుతారు.
ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ 2025-26 ప్రతిపాదిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు, ఆర్థిక మంత్రి తన బడ్జెట్ బృందంతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డీడీ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇలా శనివారం అంతా ఆర్థిక మంత్రి బిజీబిజీగా గడపనున్నారు. పూర్తి కథనం
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న Union Budget 2025 నుంచి మీరు ఆశిస్తున్నది ఏమిటి
నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న Union Budget 2025 నుంచి మీరు ఆశిస్తున్నది ఏమిటి. ఏసియానెట్ న్యూస్ తెలుగు పోల్లో పాల్గొనండి.
Budget 2025: రైల్వే పై ప్రధానంగా ఫోకస్
Budget 2025: బడ్జట్ సమావేశాలు ప్రారంభం రాష్ట్రపతి ప్రసంగం వీడియో
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి President Droupadi Murmu ఈరోజు ప్రసంగించారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
Budget 2025: మహిళా సమ్మాన్ సేవింగ్స్ కొనసాగేనా
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు అధిక వడ్డీని ఇచ్చే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే ఇది కొనసాగుతుందా లేదా అనేది ఈ బడ్జెట్ లో సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే దీనికి మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు ‘ఆజాది కా అమృత్ మహోత్సవం’ సందర్భంగా 2023-24 సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు.
Budget 2025: భారీగా పెరగనున్న గోల్డ్ ధరలు
బంగారం దిగుమతులు పెరగడంతో విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోంది.ఇది రూపాయి పతనానికి ఆజ్యం పోస్తోంది. నగల పరిశ్రమ సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది.మరోవైపు బంగార కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. దీనికి తోడు బంగారాన్ని బాగా దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.87 వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఈ బంగారంపై బంగారంపై భారీగా పన్నులు, సుంకాల వడ్డింపు ఉంటుదని భావిస్తున్నారు. మరింత చదవండి
ఆర్థిక సర్వేలోని 10 కీలక అంశాలు
Economic Survey 2025 : నిర్మలా సీతారామన్ ఇవాళ (జనవరి 31, శుక్రవారం) పార్లమెంటులో 2024-25 ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ GDP (Gross Domestic Product) వృద్ధి 6.3% నుండి 6.8% వరకు ఉండవచ్చని ఈ సర్వే తేల్చింది.. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం ఒకటి నుండి రెండు దశాబ్దాల పాటు 8% వృద్ధి అవసరమని సర్వే అంచనా వేసింది. మరింత చదవండి
BUDGET 2025: బడ్జెట్ పై సామాన్యుడు పెట్టుకున్న అంచనాలు ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న శనివారం 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ పై సామాన్యుని అంచనాలు ఏమున్నాయో చూద్దాం.
సామాన్య పౌరుడికి ప్రధాన ఆందోళనలలో ఒకటి ద్రవ్యోల్బణం. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం వల్ల ఇల్లు గడవడం కష్టంగా మారుతోంది. ఈ ఏడాది బడ్జెట్ వారికి కొంత ఉపశమనం కలిగిస్తుందని చాలామంది ఆశిస్తున్నారు.
ఈ బడ్జెట్ లో కూడా ఆదాయపు పన్ను తగ్గింపుపై ప్రజలకు అంచనాలున్నాయి. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయపన్ను నుండి ఉపశమనం కోరుకుంటున్నారు.
1961 ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా కొత్త ప్రత్యక్ష పన్ను చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి.
కూరగాయలు, వంట నూనె, పాలు మరియు ప్యాక్ చేసిన ఆహారం వంటి నిత్యావసర ఆహార పదార్థాల ధరలు ఇటీవల బాగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం ఏర్పడింది. దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ... వేతనాలు పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా లేవు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం బ్యాండ్‌లో ఉంచడానికి కృషి చేస్తోంది, అయితే అధిక ధరలు సగటు పౌరుడిని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మరింత చదవండి