Asianet News TeluguAsianet News Telugu

దేశంలో మూడో ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.218.112 కోట్ల ఆదాయం - ఏడీఆర్ నివేదిక

దేశంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ బాండ్ల అత్యధిక ఆదాయం పొందిన మూడో ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది. మొదటి స్థానంలో డీఎంకే, రెండో స్థానంలో బీజేడీ నిలిచాయి. ఈ వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా నివేదికలో వెల్లడించింది

BRS is the third richest regional party in the country..Rs 218.112 crore income through electoral bonds - ADR report..ISR
Author
First Published Apr 10, 2023, 1:53 PM IST

2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోని 36 ప్రాంతీయ పార్టీలు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందుకున్న విరాళాల అంచనాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. ఇందులో తమిళనాడుకు చెందిన ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఒడిశాకు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) రెండో స్థానంలో, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) మూడో స్థానంలో నిలిచింది.

ప్రతిపక్షాలపై శరద్ పవార్ ఫైర్.. డిగ్రీ అంశం తప్ప దేశంలో ముఖ్యమైన సమస్యలేమీ లేవా అంటూ కామెంట్స్..

2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల ప్రకారం ఏడీఆర్ ఈ నివేదికను విడుదుల చేసింది. దీని ప్రకారం.. డీఎంకేకు దేశంలోని 36 ప్రాంతీయ పార్టీలకు విరాళంగా అందించిన మొత్తం నిధులలో దాదాపు 26.27 శాతం (రూ. 318.745 కోట్లు) అందుకుంది. బిజూ జనతాదళ్ (బీజేడీ) రూ.307.288 కోట్లు, భారత రాష్ట్ర సమితి రూ.218.112 కోట్ల అందుకున్నాయి. 

నమాజ్ చేస్తున్న వారిపై దుండగుల దాడి.. మసీదును ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత.. ఎక్కడంటే ?

36 పార్టీలలో 35 పార్టీల మొత్తం ఆదాయం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 565.424 కోట్ల నుండి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 1212.708 కోట్లకు పెరిగిందని, మొత్తం 114.48 శాతం వృద్ధి చెందిందని నివేదిక వెల్లడించింది. అయితే విరాళాలు అందుకున్న పార్టీల్లో  21 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఖర్చు చేయలేదని ప్రకటించాయి. కానీ 15 రాజకీయ పార్టీలు సేకరించిన ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేశామని పేర్కొన్నాయి.

మరోసారి భారత్ ను పొగిడిన పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. ఇండియా లాగే చౌకగా ముడిచమురు కొనాలనుకున్నాం.. కానీ

2021-22 ఆర్థిక సంవత్సరంలో డీఎంకే మొత్తం ఆదాయంలో రూ. 283.344 కోట్ల కంటే ఎక్కువ మిగిలి ఉండగా,  బీజేడీ వద్ద 278.658 కోట్లు, బీఆర్ఎస్ వద్ద రూ. 190.173 కోట్లు మిగిలాయని నివేదిక పేర్కొంది. కాగా.. ఎస్‌ఏడీ, ఏఐఏడీఎంకే, టీడీపీ, జేడీఎస్, ఎంజీపీ, ఆర్ఎల్ డీ, పీఎంకే, ఐఎన్ఎల్ డీ, జేకేపీడీపీ, ఏఐయూడీఎఫ్, ఎన్ పీఎఫ్, ఎస్ డీఎప్, పీడీఏ, డీఎండీకే, జేసీసీ(జే) అనే 15 ప్రాంతీయ పార్టీలు తమ ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించాయి.

"ఆ ఇద్దరు నాయకులు డ్రామాలు ఆడుతున్నారు. అసలు ఉద్యమంలో వారి పాత్రేంటీ? ": నిరంజన్ రెడ్డి

ఇదిలా ఉండగా.. జాతీయ పార్టీల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ ఆదాయం అత్యధికంగా రూ.74.41 కోట్ల నుంచి రూ.545.74 కోట్లకు 633 శాతం పెరిగింది. బీజేపీ ఆదాయం రూ.752.33 కోట్ల నుంచి రూ.1917.12 (154 శాతం) కోట్లకు, కాంగ్రెస్ ఆదాయం రూ.285.76 కోట్ల నుంచి రూ.541.27 కోట్లకు (89.4  శాతం) చేరింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios