Asianet News TeluguAsianet News Telugu

దేశ విభజన తర్వాత 74 ఏళ్లకు కర్తార్‌పూర్‌లో మళ్లీ కలుసుకున్న సోదరులు

దేశ విభజన జరిగి 74 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ సోదరులు తొలిసారి మళ్లీ కలుసుకున్నారు. వారి కలయికకు పాకిస్తాన్ కర్తార్‌పూర్‌లోని గురుద్వారా సాహిబ్ వేదిక అయింది. వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఎట్టకేలకు మనం మళ్లీ కలువగలిగాం అని ఒకరు చెప్పారు. కాగా, తాను పెళ్లి చేసుకోలేదని, తల్లికి సేవ చేయడానికే జీవితాన్ని అంకితం చేసినట్టు పాకిస్తాన్‌లోని సోదరుడికి హబీబ్ వివరించాడు. వారిద్దరూ కలుసుకుని హగ్ చేసుకున్న దృశ్యాలు అక్కడి వారిలో హృదయాలను తడిమాయి.
 

brothers reunited at gurudwara sahib in pakistan
Author
New Delhi, First Published Jan 13, 2022, 5:50 AM IST

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌(Pakistan)లో కర్తార్‌పూర్ సాహిబ్(Kartarpur Sahib) దగ్గర గల గురుద్వారా దర్బార్ సాహిబ్‌(Gurudwara Sahib)లో బుధవారం అరుదైన ఘటన చోటుచేసుకుంది. అక్కడున్న ప్రతి ఒక్కరు కొన్ని క్షణాలపాటు ఇధ్దరు టర్బన్ సోదరుల(Brothers)ను చూసి ఎమోషన్(Emotional) అయ్యారు. ఆ ఇద్దరు వృద్ధ సోదరులు మళ్లీ 74 ఏళ్ల తర్వాత కలుసుకున్న(Reunited) ఉద్వేగ భరిత క్షణాలను తన్మయత్వంతో ఆస్వాదించారు. అందరూ ఆ ఉద్వేగంలో మునిగిపోయారు. వారిద్దరూ సోదరులు భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయి 74 ఏళ్లు గడిచిన తర్వాత తొలిసారి మళ్లీ కలుసుకున్నారు. హగ్ చేసుకున్నారు. ఒకరి వెన్ను మరికొరు తట్టుకుంటూ సోదరాభావాన్ని అక్కడి వాతావరణంలో కలిపేశారు. దీంతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అరుదైన వాత్సల్యాన్ని చూసి తరించారు. సోదరా ఎట్టకేలకు మనం కలవనైతే.. కలిశాం అని అందులో ఒకరు మరొకరితో ప్రేమతో నిండిన గొంతుతో అన్నారు.

ముహమ్మద్ హబీబ్ అలియాస్ శైలా భారత్‌కు చెందినవారు. ఆయన సోదరుడు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ఉంటున్నాడు. ఆయన పేరు ముమహ్మద్ సిద్దిఖ. ఇద్దరు ఒకరిపై ఒకరు ప్రేమ కురిపించుకున్నారు. సోషల్ మీడియాలోని కొందరి సహకారంతో చాలా ఏళ్ల క్రితం తమ నుంచి మిస్ అయిన సోదరుడు ముహ్మమద్ సిద్ధిఖిని వెతికిపట్టే పనికి పూనుకున్నారు. ఎట్టకేలకు సోదరుడు సిద్దిఖీ ఆచూకీని కనిపెట్టగలిగారు. పాకిస్తాన్‌లో గురుద్వార సాహిబ్ ఓపెన్ చేసే వరకు వెయిట్ చేశారు. అనంతరం అక్కడ ఇరువురు సోదరులు 74 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. హబీబ్ తన సోదరుడు సిద్దిఖీతో మాట్లాడాడు. తాను పెళ్లి చేసుకోలేదని వివరించాడు. తన జీవితాన్ని తల్లికి సేవ చేయడానికే అంకితం ఇచ్చాడని తెలిపాడు.

వీరితోపాటు మరికొన్ని కుటుంబాలూ తమ ఆప్తులను ఈ గురుద్వారా సాహిబ్ దగ్గర కలుసుకున్నాయి. పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లా వాసి సునీతా దేవి.. ఐదుగురు సభ్యులతో సరిహద్దు దాటి గురుద్వారాకు చేరుకున్నారు. వారు పాకిస్తాన్‌లోని తమ బంధువులతో కలశారు. దేశ విభజన జరిగినప్పుడు తండ్రి ఇక్కడే పంజాబ్‌లో ఉండిపోవడానికి నిర్ణయించుకున్నాడు. కాగా ఆయన సోదరులు మాత్రం పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో నివసించడానికి ఎంచుకున్నారు. ఇప్పుడు తాజాగా కర్తార్ పూర్ సాహిబ్‌లో కలుసుకున్నారు. 

పాకిస్థాన్ ప్రభుత్వం గతేడాది ఆగస్టులో కీలక నిర్ణయం తీసుకుంది. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారాకు సెప్టెంబర్ నుంచి భక్తులను అనుమతించనున్నట్టు వెల్లడించింది. సెప్టెంబరు 22న సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురు నానక్ దేవ్ వర్థంతి.. దీనిని పురస్కరించుకుని కర్తార్ పూర్ పుణ్యక్షేత్రాన్ని సిక్కు యాత్రికుల సందర్శనార్థం తెరవాలని పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (ఎన్సీఓసీ) నిర్ణయించింది. సిక్కు భక్తులను దర్శనానికి అనుమతించాలని, కరోనా మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా చూడాలని ఎన్సీఓసీ సమావేశంలో తీర్మానించారు.

పాకిస్తాన్‌కు వచ్చేవారు వ్యాక్సిన్ రెండు డోసులు పొంది ఉండాలని, ఆర్టీ-పీసీఆర్ టెస్టు ఫలితాలు కూడా సమర్పించాలని అక్కడి ప్రభుత్వం నిబంధనలు విధించింది. పాకిస్థాన్ కరోనా ప్రభావిత దేశాలను మూడు కేటగిరీలుగా విభజించింది. సి కేటగిరీలో ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై పాక్ కఠిన ఆంక్షలు విధిస్తోంది. వారిని ఎన్సీఓసీ మార్గదర్శకాలకు లోబడి అనుమతిస్తారు. డెల్టా వేరియంట్ కేసులు ఎక్కువ రావడంతో మే 22 నుంచి ఆగస్టు 12 వరకు భారత్ ను పాకిస్థాన్ సి కేటగిరీలో ఉంచిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios