అన్నాచెల్లెళ్లు ప్రేమికులయ్యారు.. చివరికి..?

First Published 29, Jun 2018, 2:07 PM IST
brother and sister falling love commit suicide
Highlights

అన్నాచెల్లెళ్లు ప్రేమికులయ్యారు.. చివరికి..? 

వాళ్లిద్దరూ ఒకే పాఠశాలలో చదవుకుంటున్నారు.. రోజూ కలిసివెళ్లి.. కలిసి వస్తుండటంతో వారిద్దరి మధ్యా సాన్నిహిత్యం బాగా పెరిగి.. ఒకరిని విడిచి మరోకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. ఇద్దరి ప్రేమ ముదిరిపాకాన పడటంతో విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. అయితే ఎంక్వైరీలో అసలు నిజం బయటకు వచ్చింది. ఒకే కులానికి చెందిన వారైన వీరిద్దరూ.. వరుసకు అన్నాచెల్లెళ్లని తేలింది.

దీంతో ఇక నుంచి ఇద్దరూ విడి విడిగా ఉండాలని.. ప్రేమకు స్వస్తి  చెప్పాలని తల్లిదండ్రులు గట్టిగా మందలించారు. దీనిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా కుడియాకురిచ్చిలో ఈ సంఘటన జరిగింది. మా ప్రేమను మీరు అర్ధం చేసుకోరు.. మేం చనిపోయి మా ప్రేమను బ్రతికించుకుంటాం అంటూ.. వారు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

loader