Asianet News TeluguAsianet News Telugu

ఆనంద్ సినిమా రిపీటయ్యింది... పెళ్లి లెహంగా నచ్చలేదని.. వివాహాన్ని రద్దు చేసుకున్న వధువు..

పెళ్లిరోజు వేసుకునే బట్టల విషయంలో అమ్మాయిలు చాలా పర్టిక్యులర్ ఉంటారు. అలా లెహంగానచ్చలేదని ఓ యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. 

Bride who canceled wedding cause she didnot like lehenga in Uttarakhand
Author
First Published Nov 10, 2022, 7:29 AM IST

ఉత్తరాఖండ్ : ఆనంద్.. సినిమా గుర్తుందా? శేఖర్ కమ్ముల తీసిన ఈ సినిమా అప్పట్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది. దీంతో హీరోయిన్ గా కమలినీ ముఖర్జీకి యూత్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు ఇదెందుకంటే.. అందులో ఫస్ట్ సీన్ లో హీరోయిన్ పెళ్లి చీర కోసం కాబోయే అత్తగారితో గొడవపెట్టుకుని.. పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటుంది. ఆ తరువాత చీరకోసం పెళ్లి చెడుగొట్టుకుందని సమాజం తనను నిందిస్తుందని బాధపడుతుంది. అది సిల్లీ రీజనే అయినా.. అక్కడి ఎమోషన్ మనల్ని కాంప్రమైజ్ అయ్యేలా చేస్తుంది. అచ్చం అలాంటి సీనే ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెడితే.. లెహంగా నచ్చలేదన్న కారణంతో ఒక వధువు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఘటన ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో జరిగింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి తీవ్రరూపం దాల్చడంతో పోలీసులు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. హల్ద్వానీలో నివాసం ఉంటున్న ఓ యువతికి, ఆల్మోరాలో నివాసముంటున్న ఓ యువకుడితో వివాహం నిశ్చయమయింది. నవంబర్ 5న పెళ్ళికి ముహూర్తం ఖరారు చేశారు. యువకుడి తరఫు వాళ్ళు పెళ్లి కార్డులు కూడా అచ్చు వేయించారు. ఇక్కడివరకూ అంగా బాగానే ఉంది. కాబోయే పెళ్లి గురించి వధువు, వరుడు కలలు కనడం కూడా బాగానే ఉంది.

దారుణం.. మద్యం మత్తులో తల్లిని కొట్టి.. సజీవంగా పూడ్చేసిన కొడుకు..

అయితే, ఇంతలోనే ఇరువర్గాలకు ఓ విషయం మీద  వాగ్వాదం మొదలైంది. అదెక్కడా అంటే... పెళ్లి కుమార్తె కోసం వరుడి తండ్రి లఖ్ నవూ నుంచి ఒక ఖరీదైన లెహంగా తెప్పించారు. కాబోయే కోడలు గ్రాండ్ గా కనబడాలని ఎంతో ప్రేమగా మామగారు తెప్పించి.. సంతోషంగా.. పెళ్ళికి ముందు దాన్ని ఆమెకు ఇచ్చారు. అయితే, ఇక్కడే అసలు రచ్చ మొదలయ్యింది. ఆ లెహంగాను చూసిన యువతి మొహం చిట్లించింది. అది తనకు నచ్చలేదని ఎలాంటి మొహమాటం లేకుండా తేల్చిచెప్పింది. ఈమాట కాస్తా.. అబ్బాయి ఇంట్లో తెలిసింది. అంతే, అంత ప్రేమగా.. అన్ని డబ్బులు పోసి కొనుక్కొస్తే.. కనీసం మొదటిసారి అని.. అత్తగారింటినుంచి వచ్చిందని.. సర్దుకుపోతే తప్పేం లేదన్న.. ఆలోచన కూడా లేకుండా నిర్మొహమాటంగా చెప్పడం.. అత్తింటివారికి చురుక్కుమనిపించింది. 

దీంతో ఆ రెండు కుటుంబాల మధ్య ఇది వాగ్వాదానికి దారితీసింది.  ఈ పెళ్లి జరిగేది లేదంటూ ఇరువర్గాలు ఒప్పందానికి వచ్చాయి.  అలా అక్టోబర్ 30న యువకుడి బంధువులు యువతి ఇంటికి చేరుకుని లక్ష రూపాయల నగదు ఇచ్చి వివాహ రద్దు ఒప్పందానికి వచ్చారు. ఆ తరవాత అమ్మాయి తరపు వారే వివాహ ప్రస్తావనతో యువకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో మరోసారి వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్ కు చేరింది.  పోలీసులు సర్దిచెప్పడంతో పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు ఇరువర్గాలు నిర్ణయం తీసుకున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios