నువ్వు ఎవడ్రా నన్ను పట్టుకోవడానికి.. లాగి పీకిన వధువు

bride slaps guest
Highlights

నువ్వు ఎవడ్రా నన్ను పట్టుకోవడానికి.. లాగి పీకిన వధువు

భిన్నత్వంలో ఏకత్వం కలగలిసిన భారతదేశంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సాంప్రదాయం.. ఆచారాలను ప్రజలు పాటిస్తుంటారు. అయితే ఇవి అందరికి ఆమోదయోగ్యంగా వుండవచ్చు.. వుండకపోవచ్చు. తాజాగా ఓ ఆనవాయితీ ఓ వ్యక్తి చెంప పగలగొట్టించింది. కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియోలో పెళ్లి వేడుక జరుగుతుంది.. ముహూర్తం దగ్గర పడే సమయంలో వధువు, వరుడు దండలు మార్చుకునేందుకు నిలబడ్డారు.

వారి సాంప్రదాయం ప్రకారం వరుడిని, వధువుని వారి బంధువులు ఎత్తుకుని దండలు మార్పించాలి.. దీనిలో భాగంగా వరుడి తరపు బంధువు అతన్ని ఎత్తుకుని వధువు మెడలో దండ వేయించాడు.. ఇప్పుడు వధువు వంతు వచ్చింది. ఆమె తరపు బంధువు పైకి ఎత్తుకుని దండ వేయించాడు. ఆ క్రతువు పూర్తయిన వెంటనే.. కిందకు దించాడు.. ఆ వెంటనే  క్షణం కూడా ఆలస్యం చేయకుండా తనను ఎత్తుకున్న బంధువును లాగి ఒకటి పీకింది ఆ పెళ్లికూతురు.

అంతటితో ఆగకుండా నాలుగు తిట్లు తిట్టింది. నలుగురి ముందు తనకు జరిగిన అవమానానికి బాగా ఫీలయిన ఆ వ్యక్తి.. పక్కనే ఉన్న మరో యువతిని లాగి కొట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

"

loader