సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో వరుడు, వధువు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరి చెంప మరొకరు చెళ్లుమనిపించారు. క్షణాల్లోనే ఆ పెళ్లి రసాభాసగా మారింది. ఆ వీడియోను చూసేయండి. 

న్యూఢిల్లీ: సాధారణంగా వధువు, వరుడు పెళ్లి పీటలపై నర్వస్‌గా కనిపిస్తుంటారు. పెళ్లి తంతు, నిద్రలేమి వంటి కారణాలతో పేలవంగా ఉంటారు. అయినా, చాలా యాక్టివ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రతి క్షణం ఎంతో అప్రమత్తతో ఉంటూ ఫొటోలు, వీడియోల్లో అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా మెలుగుతారు. కానీ, ఈ జంట మాత్రం పెళ్లి మండపంలో ఉండాల్సిన వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేశారు. ఒకరిపై ఒకరు చేజేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. నెటిజన్లూ కామెంట్లతో పేలుతున్నారు.

ఆ వీడియో ప్రకారం, వరుడు.. వధువుకు స్వీట్ తినిపించడానికి చేయి ముందుకు చాచాడు. ఆమె పెదవుల వద్దకు తీసుకెళ్లాడు. కానీ, వధువు మాత్రం అయిష్టంగా తలను వెనక్కి తీసుకుంది. వరుడు ఆ సంకేతాన్ని పట్టించుకోకుండా ముందుకే చేయి చాచి నోటిలో కుక్కే ప్రయత్నం చేశాడు. వధువు ఒక్కసారిగా ఫైర్ అయింది. వరుడి చేతిని దూరంగా నెట్టేసింది. అంతటితో ఆగకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది. వరుడు కూడా అంతే వేగంగా ఆమె చెంపపై కొట్టాడు. ఆ దాడి ఇంకా తీవ్రమైంది. వరుడు తన తలపాగ తీసి ఆమెపై దాడి చేశాడు. ఒకరినొకరు తోసుకున్నారు. పక్కనే ఉన్నవారు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును ఆపడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. వారిద్దరూ నెట్టేసుకోవడం, ఆ తర్వాత కింద పడేసుకోవడం చకచకా జరిగిపోయాయి. ఆ వీడియో ఆసాంతం వారు కొట్టుకుంటూనే కనిపించారు.

Also Read: ఢిల్లీ టీనేజీ అబ్బాయిని హతమార్చిన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు, లవర్: పోలీసులు

ఆ వీడియోపై నెటిజన్లు కామెంట్లు కుమ్మరించారు. వారిద్దరికీ పెళ్లి చేసుకునే అర్హత లేదని, ఇద్దరూ సింగిల్‌గానే ఉండనివ్వండని ఒకరు చురక అంటించాడు. పెళ్లికి, విడాకులకు ఒకే రోజు దరఖాస్తు చేసుకున్నప్పుడు అంటూ మరొకరు కామెంట్ చేశాడు. వారిద్దరూ ఎప్పటికీ ఆలుమగలు కాలేరని వేరొకరు జోస్యం చెప్పాడు.

Scroll to load tweet…

కాగా, కొందరేమో ఇది నిజంగా జరిగిందా? అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో లైకుల కోసం తయారు చేసిన నకిలీ వీడియో ఇది అని ఇంకొందరు స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. వరుడిని ఆపుతున్న వ్యక్తి చాలా సరదాగా కనిపిస్తున్నాడని, నవ్వుతున్నాడని మరొకరు అబ్జర్వ్ చేసి చెప్పారు.