ఢిల్లీలో 16 ఏళ్ల అబ్బాయి దారుణ హత్యకు గురయ్యాడు. ఆ బాలుడి ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు, ఆమె ప్రస్తుతం లవర్ కలిసి ఈ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దొంగతనం కేసులో నాలుగు నెలలు అబ్జర్వేషన్ హోంలో గడిపి బయటకు రాగానే.. గర్ల్‌ఫ్రెండ్ మరో వ్యక్తిని ఇష్టపడుతున్నట్టు ఆ టీనేజీ బాలుడు తెలుసుకుని ఆగ్రహించాడు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టీనేజీ బాలుడి హత్య కలకలం రేపింది. మాజీ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడు, ఆమె ప్రస్తుత లవర్ కలిసి ఆ అబ్బాయిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన ఈశాన్య ఢిల్లీలో శాస్త్రి పార్క్ ఏరియాలో జరిగిందని పోలీసులు గురువారం వెల్లడించారు.
16 ఏళ్ల టీనేజీ బాలుడిని మాజీ గర్ల్ ఫ్రెండ్ సదరుడు సాహిల్ (20), ఆమె లవర్ యామిన్ (18)లు చంపేశారు.
16 ఏళ్ల అబ్బాయి కుటుంబం పై అంతస్తులో అద్దెకు ఉండగా.. కిందనే సాహిల్ కుటుంబం నివసించేది. సాహిల్ సోదరితో ఆ టీనేజీ బాలుడికి పరిచయం ఏర్పడింది. వారిద్దరు ప్రేమించుకున్నారు. కానీ, ఈ రిలేషన్‌షిప్ సాహిల్‌కు నచ్చేది కాదు. పలుమార్లు గొడవలూ పెట్టుకున్నారు.
ఇటీవలే ఆ 16 ఏళ్ల అబ్బాయి చోరీ కేసులో ఓ అబర్వేషన్ రూమ్‌లో నాలుగు నెలల పాటు ఉన్నాడు. మార్చి 5వ తేదీన విడుదలై ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పటికే ఆ అమ్మాయి యామిన్ పై ప్రేమ పెంచుకుంది. ఇది ఆ అబ్బాయికి నచ్చలేదు. కోపోద్రిక్తుడయ్యాడు.
మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం చేస మిత్రులను కలిసి వస్తానని తల్లికి చెప్పి బయటకు వచ్చాడు. అప్పటికే రాత్రి 9.46 గంటలకు యామిన్ ఆ అబ్బాయికి కాల్ చేసి తమను కలవాలని, కాసేపు నడుచుకుంటూ కాలక్షేపం చేద్దామని చెప్పాడు. దీంతో ఆ అబ్బాయికి బయటకు వచ్చి సాహిల్, యామిన్‌లను కలుసుకున్నాడు. ఆ అబ్బాయి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా వారితోపాటే నడుచుకుంటూ వెళ్లాడు. అదే చీకట్లో సాహిల్ అబ్బాయిని కొట్టి నేలపై పడేయగా.. యామిన్ కత్తితో దాడి చేశాడు. ఆ కత్తిని మరో చోట పడేసి వారిద్దరూ పరారయ్యారు.
సహరన్‌పూర్ ఎక్స్‌ప్రెస్ వేకు సమీపంలో ఖాదర్ ఏరియా వద్ద రెండో పుష్ట రోడ్ దగ్గర ఆ బాలుడి మృతదేహం పోలీసులకు బుధవారం కనిపించింది.
పోలీసులు ఆ అబ్బాయి ఫోన్‌ను, హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని రికవరీ చేసుకోవాల్సి ఉంది. కాగా, సాహిల్, యామిన్‌లను పోలీసులు పట్టుకున్నారు. వారిని దర్యాప్తు చేయగా.. హత్య చేసినట్టు అంగీకరించారు.
