Asianet News TeluguAsianet News Telugu

‘ఉరి’ వేసుకునే ఆట.. తాడు బిగుసుకుని పదకొండేళ్ల బాలుడు మృతి

టీవీ సీరియల్స్ లో చూసినట్టుగా ఉరివేసుకునే ఆట ఆడదామని ఓ చిన్నారి చేసిన ప్రయత్నం అతని ప్రాణాలు తీసింది.  

boy play-acting suicide with brother dies after noos tightens in Chennai
Author
First Published Sep 26, 2022, 11:32 AM IST

చెన్నై : సూసైడ్ గేమ్ ఓ చిన్నారి ప్రాణం తీసిన ఘటన తమిళనాడులో విషాదాన్ని నింపింది. టీవీ సీరియల్ లో చూసినట్టుగా తాను ఆత్మహత్య చేసుకున్నట్టు ఉరివేసుకుంటా.. నువ్వు తలుపులు పగలగొట్టి రక్షించాలి అంటూ ఓ 11 యేళ్ల బాలుడు..తన 13 యేళ్ల అన్నతో ఆట మొదలుపెట్టాడు. అయితే, కాళ్లకింద స్టూలు పడిపోవడం, తాడు గొంతుకు బిగుసుకుపోవడంతో ఉరిపడి ఆ చిన్నారి ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. మృతుడు 7వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థి జె కార్తీక్‌గా గుర్తించారు. అతను తన సోదరుడు రాంశరణ్ (13), తల్లి అముధతో కలిసి పుజాల్ సమీపంలోని పుతగరం వద్ద కామరాజర్ నగర్ లోని 8వ వీధిలో నివసిస్తున్నాడు. సోదరుడు రామ్‌శరణ్‌ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన సమయంలో తల్లి అముద తాను పనిచేస్తున్న అన్నానగర్‌ గార్మెంట్స్‌ దుకాణంలో ఉందని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న పిల్లలిద్దరు ఆడుకునే క్రమంలో ఎనాక్ట్ చేద్దామనుకున్నారు. 

అమానుష ఘ‌ట‌న‌.. మంత్రాల పేరుతో దాడి.. మ‌హిళ‌లతో మ‌ల‌విస‌ర్జ‌న తినిపించిన దుండగులు

దాంట్లో భాగంగా ఒకరు ‘ఉరి’ వేసుకుంటే.. మరొకరు హీరోలాగా తలుపులు పగలగొట్టుకుని వచ్చి కాపాడాలి. అయితే మృతుడు కార్తీక్ ఆ సీన్ తాను చాలా టీవీ సీరియల్స్ లో చూశానని తాను చేస్తానని అన్నాడు. అన్న సరే అన్నాడు. అలా కార్తీక్ ఓ గదిలోకి వెళ్లి లోపలినుంచి గడియవేసుకున్నాడు. ఆ తరువాత స్టూల్ మీద నిలబడి సీలింగ్ కు తాడువేసి ఉరివేసుకుంటున్నాడు. ఇదంతా కిటికీ బయటినుంచి అన్న గమనిస్తున్నాడు. ఇంతలో కార్తీక్ కాళ్లకింద ఉన్న స్టూల్ ప్రమాదవశాత్తు పడిపోయింది. దీంతో కార్తీక్ మెడలో వేసుకున్న తాడు.. ఉచ్చు బిగుసుకుంది. 

కార్తీక్ రక్షించమంటూ కేకలు వేయడం ప్రారంభించాడు. అది చూస్తున్న రాంశరణ్ తలుపులు తీయడానికి ప్రయత్నించాడు కానీ.. అతనితో కాలేదు. దీంతో అతను బైటికి పరిగెత్తి ఇరుగుపొరుగు వారిని పిలుచుకొచ్చాడు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి.. కార్తీక్ మెడలోని తాడును తొలగించారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న తల్లి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని భోరున విలపించింది. 

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ప్రమాదవశాత్తు మృతి చెందాడని కేసు నమోదు చేసిన పుఝల్ పోలీసులు మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం భర్త జయరామన్ చనిపోవడంతో అముద తన పిల్లలు రాంశరణ్, కార్తీక్‌లతో ఒంటరిగా జీవిస్తోంది. రెండు నెలల క్రితమే ఆమె పుత్తగారంలో ఇల్లు కట్టుకుని అందులోకి మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios