Asianet News TeluguAsianet News Telugu

అమానుష ఘ‌ట‌న‌.. మంత్రాల పేరుతో దాడి.. మ‌హిళ‌లతో మ‌ల‌విస‌ర్జ‌న తినిపించిన దుండగులు

Dumka district: మంత్రాలు చేస్తున్నార‌నే నేప‌పంతో ముగ్గురు మ‌హిళ‌లు స‌హా న‌లుగురిపై తీవ్రంగా దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా వారితో బ‌ల‌వంతంగా మానవ మ‌ల విజ‌ర్జ‌న‌ను తినిపించారు. ఈ అమానుష ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 
 

Jharkhand : an attack in the name of witches; Women fed human excretion
Author
First Published Sep 26, 2022, 11:28 AM IST

Jharkhand: అభివృద్ది, టెక్నాల‌జీలో కాలంలో పోటీగా ప‌రుగులు పెడుతూ.. అంత‌రిక్షంలో ఇండ్లు క‌ట్టుకునే స్థాయికి చేరిన నేటి స‌మాజంలో ఇప్ప‌టికీ మూఢ‌న‌మ్మ‌కాలు తొల‌గిపోలేదు. మంత్రాలు, క్షుద్ర‌పూజ‌ల పేరుతో దారుణ‌, అమానుష ఘ‌ట‌న‌లు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలోనే మంత్రాలు చేస్తున్నార‌నే నేప‌పంతో ముగ్గురు మ‌హిళ‌లు స‌హా న‌లుగురిపై తీవ్రంగా దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా వారితో బ‌ల‌వంతంగా మానవ మ‌ల విజ‌ర్జ‌న‌ను తినిపించారు. ఈ అమానుష ఘ‌ట‌న జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. జార్ఖండ్ లో అమానుష ఘ‌ట‌న చోటుచేసుకుంది. దుమ్కా జిల్లాలో చేతబడి చేశారనే ఆరోపణపై ముగ్గురు మహిళలతో సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వేడి ఇనుప రాడ్ల‌తో వారిపై దాడి చేశారు. తీవ్రంగా హింసించిన తరువాత వారితో బ‌ల‌వంతంగా మానవ విసర్జనను తినిపించారు. దుమ్కా జిల్లాలోని సరియాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశ్వరి గ్రామంలో  ఆదివారం నాడు ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

"నలుగురిపై అమానవీయ హింసకు పాల్ప‌డిన ఘ‌ట‌న‌ శనివారం రాత్రి ప్రారంభమైంది. అప్ప‌టినుంచి ఆదివారం వ‌ర‌కు వారిని తీవ్రంగా కొట్టి హింసించారు. కొంతమంది గ్రామస్తులు వారిని మంత్రగత్తెలుగా పేర్కొంటూ వారిపై దాడికి పాల్ప‌డ్డారు" అని సరియాహత్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ వినయ్ కుమార్ తెలిపారు. వారిని తీవ్రంగా కొట్టిన త‌ర్వాత బ‌ల‌వంతంగా మానవ మ‌ల విస‌ర్జ‌న‌ను తినిపించారు. అంత‌టితో ఆగ‌కుండా శ‌రీరంపై వేడిగా కాల్చిన ఇనుప రాడ్ల‌తో వాత‌లు పెట్టారు అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసు బృందం ఆదివారం గ్రామానికి వెళ్లి బాధితులను రక్షించినట్లు తెలిపారు.

తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారిని వెంట‌నే సరియాహత్ లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. "అయితే, బాధితుల‌ను నిందితులు తీవ్రంగా కొట్ట‌డంతో వారికి గాయాలు అధికంగా అయ్యాయి.  వైద్యులు వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నందున మెరుగైన చికిత్స కోసం డియోఘర్‌లోని ఆసుపత్రికి రెఫర్ చేశారు" అని పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఆరుగురిపై పోలీసు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే, నిందితులు ప‌రారీలో ఉన్నార‌నీ, వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నామని తెలిపారు.

కాగా, మంత్రాల పేరుతూ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అనేక స్వ‌చ్ఛంద సంస్థ‌లు మూఢ‌న‌మ్మ‌కాల‌పై ప్ర‌చారం క‌ల్పిస్తున్న ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌తి. మంత్రవిద్య అనుమానంతో హింసించడం రాష్ట్రంలో ప్రధానమైన సామాజిక దురాచారం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) ప్రకారం.. 2001, 2020 మధ్య కాలంలో మొత్తం 590 మంది మంత్రాల పేరుతో జ‌రిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోగా.. అందులో అధికంగా మ‌హిళ‌లు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios