Asianet News TeluguAsianet News Telugu

పంజాబ్ లో పాక్ డ్రోన్స్ కలకలం.. భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం.. 

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా ముంబెకే గ్రామ సమీపంలోని బుధవారం తెల్లవారుజామున ఇండో-పాక్ సరిహద్దు వద్ద డ్రోన్ కార్యకలాపాలను సరిహద్దు భద్రతా దళం (BSF) గుర్తించింది. వెంటనే అప్రమతమైన సైనికులు  కాల్పుల ద్వారా డ్రోన్‌ను అడ్డగించి  2.622 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Border Force Intercepts Drone At Indo-Pak Border, Recover's 2 Kg Heroin
Author
First Published Feb 2, 2023, 6:25 AM IST

డ్రగ్స్ అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. అయినా.. నిత్యం ఏక్కడొక్క చోట డ్రగ్స్ మాఫియా దారుణాలు వెలుగులోకి వస్తునే ఉంటాయి. తాజాగా.. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బుధవారం ఉదయం బీఎస్‌ఎఫ్‌ నిర్వహించిన ప్రత్యేక సెర్చ్ ఆపరేషన్‌లో భారీ ఎత్తున హెరాయిన్ బయటపడింది. పంజాబ్ లోని ఫాజిల్కా ప్రాంతంలోని బీఓపీ ఖోఖర్ సమీపంలోని ఓ పొలంలో బీఎస్ఎఫ్ అధికారులు హెరాయిన్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

అందులో 2 కిలోల 622 గ్రాముల హెరాయిన్ ఉన్నట్టు గుర్తించారు. ఆ పొలం రైతును కూడా విచారిస్తున్నారు. హెరాయిన్‌ ను పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ ద్వారా సరాఫరా చేసినట్టు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ క్రమంలో అనుమానస్పదంగా తిరుగుతున్న డ్రోన్ పై కూడా బీఎస్‌ఎఫ్ కాల్పులు జరిపింది. ఫిబ్రవరి 01, 2023 రాత్రి సమయంలో ఫజిల్కాలోని సరిహద్దు గ్రామం ముంబెకే సమీపంలో అనుమానిత డ్రోన్ ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)దళాలు  గుర్తించినట్టు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అనుమానిత ప్రాంతంలో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్నాయి.  

అంతముందురోజు..  మంగళవారం నాడు ఫిరోజ్‌పూర్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో భద్రతా బలగాలు భారీ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. బీఎస్ఎఫ్ 136 బెటాలియన్ తనిఖీల్లో వైట్ కలర్ పాలిథిన్ బ్యాగుల్లో హెరాయిన్ స్వాధీనం చేసుకుంది. 

వారం రోజుల క్రితం, జనవరి 21న, అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌కు నాయకత్వం వహిస్తున్న పంజాబ్‌లోని లూథియానాకు చెందిన వ్యక్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసింది. అతని వద్ద నుండి 53 మద్యం విక్రయాలు మరియు 13 సబ్ వెండ్‌లను స్వాధీనం చేసుకుంది. ఇందులో 34.4 కిలోల హెరాయిన్, 5.4 కిలోల మార్ఫిన్, 557 గ్రాముల నల్లమందు, 23.6 కిలోల అనుమానిత మాదక ద్రవ్యాల పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నామని, 16 మందిని అరెస్టు చేసినట్లు ఎన్‌సిబి వెల్లడించింది.

జనవరిలో..డ్రగ్ మాఫియాపై భద్రతా దళాలు, పంజాబ్ పోలీసులు ప్రత్యేక ద్రుష్టి సారించాయి. 258 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఒక వారంలో ₹ 20.5 లక్షల విలువైన 100 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద ఒక వారంలో రాష్ట్రవ్యాప్తంగా 258 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశామని, 194 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని అధికారులు తెలిపారు. .

Follow Us:
Download App:
  • android
  • ios