షాకింగ్ న్యూస్.. రాష్ట్రపతి భవన్ లో శవం

Body found at servant quarters of Rashtrapati Bhavan
Highlights

హత్యా..? ఆత్మహత్యా..?
 

దేశరాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం ఓ శవం బయటపడింది. సర్వెంట్ క్వార్టర్స్ లో ఈ శవం లభ్యమైనట్లు  డీసీపీ వెల్లడించారు. ప్రముఖ న్యూస్ ఎజెన్సీ  ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం.. ఆ శవం.. రాష్ట్రపతి భవన్ లో పనిచేసే క్లాస్ 4 ఉద్యోగిదిగా గుర్తించారు.

 అయితే.. అతనిని ఎవరైనా హత్య చేశారా..? లేక ఆత్మహత్యా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. వ్యక్తి చనిపోయిన గదికి లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉంది. దీంతో.. ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆ ఉద్యోగి ఎప్పుడు చనిపోయాడనే విషయంపై కూడా స్పష్టత రాలేదు. గది నుంచి భరించలేనంత వాసన రావడంతో బలవంతంగా గది తెలుపులు తెరచి చూడగా.. విషయం వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేసినట్లు పోలీసులు చెప్పారు. 

loader