రూ. 62 లక్షలే.. ఇంతకీ ఆ కారులో ఏముంది ?

BMW India Launches 630i GT Luxury Line In India
Highlights

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో లగ్జరీ కారును ప్రవేశపెట్టింది. సంపన్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత విలాసవంతమైన సురక్షితమైన ఫీచర్లతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ 630ఐ జిటి లగ్జరీ లైన్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది.

జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ భారత మార్కెట్లో మరో లగ్జరీ కారును ప్రవేశపెట్టింది. సంపన్న వర్గాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత విలాసవంతమైన సురక్షితమైన ఫీచర్లతో కూడిన బిఎమ్‌డబ్ల్యూ 630ఐ జిటి లగ్జరీ లైన్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ధరను రూ.61.80 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఇప్పటి వరకూ బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కేవలం స్పోర్ట్ లైన్ అనే పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే లభ్యమ్యేది. కాగా ఇందులో ఇప్పుడు లగ్జరీ లైన్ వేరియంట్ కూడా లభ్యం కానుంది. తాజా వేరియంట్ విడుదలతో బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ కారు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యం కానుంది.

బిఎమ్‌డబ్ల్యూ 6-సిరీస్ జిటి పెట్రోల్ వేరియంట్ కారులో 2 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది. ఇది గరిష్టంగా 258బిహెచ్‌పిల శక్తిని, 400ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 6.3 సెకండ్ల వ్యవధిలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

ఈ వేరియంట్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), బ్రేక్ అసిస్ట్, డైనమిక్ స్టెబిలిటి కంట్రోల్, కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, రన్-ఫ్లాట్ టైర్స్, సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మరియు డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి సురక్షితమైన ఫీచర్లతో పాటుగా అనేక విలాసవంతమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

 

loader