లోక్‌సభ ఎన్నికలు : త్వరలో 100 మందితో బీజేపీ తొలి జాబితా..?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే గురువారం 100 మందితో తొలి జాబితా ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక, ప్రచార వ్యూహంపై బీజేపీ కసరత్తు చేస్తోంది. వచ్చే గురువారం 100 మందితో తొలి జాబితా ప్రకటించేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధమైనట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఫస్ట్ లిస్ట్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్లు కూడా వుంటాయని తెలుస్తోంది. వచ్చే గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ వుంటుందని సమాచారం.
ఆ వెంటనే తొలి జాబితా వెలువడే అవకాశం వుంది. ఈసారి సొంతంగానే 370 సీట్లు గెలవాలని బీజేపీ గట్టిపట్టుదలగా వుండగా.. మొత్తంగా ఎన్డీయే కూటమి 400 సీట్లలో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ.. బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో, ఎన్డీయే 400 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు రాబోయే 100 రోజులు చాలా కీలకమని ప్రధాని ఇటీవల కార్యకర్తలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు. ప్రతి కొత్త ఓటరును, ప్రతి ఒక్కరి నమ్మకాన్ని చూరగొనాలని మోడీ సూచించారు.