దేశ వ్యతిరేక ఎజెండా కోసం విదేశీ నిధుల వినియోగం.. కాంగ్రెస్‌పై బీజేపీ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ పార్టీ సంచలన ఆరోపనణలు చేసింది. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ వ్యవహారంలో విదేశీ నిధులను వినియోగిస్తున్నారని, ఇవి దేశ వ్యతిరేక ఎజెండా కోసం ఉపయోగిస్తున్నారని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది..
కాంగ్రెస్‌పార్టీతో పాటు ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై బీజేపీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. సోనియా గాంధీ అధ్యక్షతన ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌పై బీజేపీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సోనియా గాంధీకి అమెరికాకు చెందిన జార్జ్ సొరోస్ ఫౌండేషన్ నిధుల సమయంతో నడిచే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌తో సంబంధం ఉన్నట్లు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
జార్జ్ సొరేస్ ఫౌండేషన్ నిధులు రాజీవ్ చారిటల్ ట్రస్ట్‌కు, సోనియా గాంధీకి ఎలా వస్తున్నాయన్న వివరాలను తెలియజేస్తూ ఒక చాట్‌ను బీజేపీ పార్టీ పోస్ట్ చేసింది. ఈ చాట్‌ను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ.. 'దేశ వ్యతిరేక ఎజెండాలను ముందుకు తెచ్చేందుకు విదేశీ నిధులను వినియోగిస్తున్నారా' అంటూ వరుసగా 6 ట్వీట్లు చేశారు. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలనే ఆలోచనకు సొరొస్ ఫౌండేషన్ మద్దతు తెలుపుతోందని బీజేపీ ఆరోపించిది.
భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావానికి ఇది నిదర్శనమని బీజేపీ చేసిన పోస్ట్‌లో పేర్కొంది. సోనియా గాంధీ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు సొరోస్ ఫౌండేషన్‌తో భాగస్వామ్యం ఉందని బీజేపీ విమర్శించింది. సొరోస్ ఫౌండేషన్‌కు చెందిన హ్యుమన్ రైట్స్ లా నెట్‌వర్క్(HRLN) దేశద్రోహ చట్టాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు అక్రమ రోహింగ్యా వలసదారులకు న్యాయ సహాయం అందిస్తూ.. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయని విమర్శించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, జాతీయ భద్రతను దెబ్బతీయాలని నిరంతరం ప్రయత్నిస్తున్న అలాంటి సంస్థలతో కాంగ్రెస్ ఎలా జతకట్టిందంటూ విమర్శించారు..
బీజేపీ చేసిన వరుస ట్వీట్స్ ఇవే..