మోదీ పాలనలో భూలోక స్వర్గంగా జమ్మూ కాశ్మీర్ : బిజెపి ఆసక్తికర ప్రచారం    

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ బిజెపి సరికొత్తగా ఎన్నికల ప్రచారం చేపట్టింది. బిజెపి హయాంలో ఇక్కడ జరిగిన అభివృద్దిని వివరిస్తూ 'భూలోక స్వర్గం' గా ఈ ప్రాంతాన్ని పేర్కొంటున్నారు. 

BJP Promotes Jammu and Kashmir as a  Heaven on Earth  Under Modi Leadership AKP

Jammu and Kashmir election : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు బిజెపి, కాంగ్రెస్ మధ్య మాటలయుద్దం సాగుతోంది. మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దుచేసి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదాను తగ్గించిందని... దీంతో అక్కడి ప్రజలను అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిజెపి మాత్రం ఈ ఆర్టికల్ తొలగింపు తర్వాతే అక్కడి ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని... శాంతిభద్రతలు మెరుగుపడి టూరిజం పెరగడంతో ఉపాధి అవకాశాలు పొందుతున్నారని అంటోంది. ఇలా జమ్మూ కాశ్మీర్ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఇరుపార్టీలు ప్రయత్నిస్తున్నాయి.  

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ లో శాంతిని నెలకొల్పేందుకు అనేక చర్యలు చేపట్టిందని బిజెపి నాయకులు పేర్కొంటున్నారు. దశాబ్దాలుగా అల్లకల్లోలంగా వున్న ఈ ప్రాంతం ఇప్పుడు  ప్రశాంతంగా వుందని అంటున్నారు. అక్కడి సాంస్కతిక వైభవం, సాంప్రదాయాలు కాపాడబడుతున్నాయి... ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ భూలోక స్వర్గంగా మారిందని బిజెపి  నాయకులు పేర్కొంటున్నారు.  

 జమ్మూ కాశ్మీర్ అభివృద్దికి మోదీ సర్కార్ కట్టుబడి వుందని... ఇప్పటికే అక్కడ మౌళిక సదుపాయాలను మెరుగుపర్చే పనిలో వుందని అంటున్నారు. ముఖ్యంగా అక్కడి ప్రకృతి అందాలను దేశ ప్రజలందరికి పరిచయం చేస్తూ టూరిజంను అభివృద్దిచేసే చర్యలు జరుగుతున్నాయి. దీంతో దేశ ప్రజలే కాదు విదేశీయులు సైతం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తగా హైవేలు, విమానాశ్రయాల అభివృద్ది, రైల్వే లైన్లను మెరుగుపర్చడం ద్వారా జమ్మూ కాశ్మీర్ లో టూరిజం అభివృద్దికి కృషి చేస్తున్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెబుతోంది. ఎన్నికల వేళ జమ్మూ కాశ్మీర్ లో మోదీ సర్కార్ చేపట్టిన అభివృద్దిని బిజెపి నాయకులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios