BJP NEC in Hyderabad: హైద‌రాబాద్ లో రెండు రోజుల బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం, అనంత‌రం ప‌రేడ్ గ్రౌండ్స్ భారీ బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో భాగ్య‌న‌గ‌రం కాషాయ రంగును సంత‌రించుకుంది. బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని మోడీ కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించ‌నున్నార‌ని స‌మాచారం. 

BJP nec in Telangana: రాబోయే 30 నుంచి 40 ఏళ్లు తమ పార్టీ యుగంగా ఉంటుంద‌నీ, భారతదేశం ‘విశ్వ గురువు’ (ప్రపంచ నాయకుడు) అవుతుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) రెండు రోజుల జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం హైద‌రాబాద్ లోని నోవాటెట్ లో జ‌రుగుతోంది. దీనికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా ఇత‌ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, సీనియ‌ర్ నాయ‌కులు, అధికార ప్ర‌తినిధులు ఇందులో పాలుపంచుకోవ‌డానికి భాగ్య‌న‌గ‌రానికి చేరుకున్నారు. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశం ఆదివారం సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ముగియ‌నుందని స‌మాచారం. ఈ స‌మావేశ అనంత‌రం ప్ర‌ధాని మోడీ స‌హా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కులు ప‌రేడ్ గ్రౌండ్స్ లో జ‌రిగే బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. 

వ‌చ్చే 40 ఏండ్లు బీజేపీవే..

హైద‌రాబాద్‌లోని నోవాటెల్ లో జ‌రుగుతున్న జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశంలో రాజ‌కీయ తీర్మానాల‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్ర‌తిపాదించారు. "వంశపారంపర్య రాజకీయాలు, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలు మహా పాపాలు" అని, సంవత్సరాలుగా దేశ కష్టాలకు కారణమని ఈ సంద‌ర్భంగా ఆయ‌న అన్నారు. అమిత్ షా ప్ర‌సంగంపై విలేకరులతో మాట్లాడిన అసోం ముఖ్య‌మంత్రి హిమంత బిస్వా శర్మ కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. పార్టీ అభివృద్ధి, పనితీరు రాజకీయాలు, ప్రజల ఆమోదాన్ని నొక్కిచెప్పడానికి, కుటుంబ పాలన రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. కులతత్వం, బుజ్జగింపు రాజ‌కీయాలు దూరం చేయాల‌ని పేర్కొన్నార‌ని తెలిపారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ కుటుంబ పాలనను అంతం చేస్తుందని, కాషాయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుండి ఇప్పటివరకు కాషాయ పార్టీ అధికార యాత్రకు దూరంగా ఉన్న ఇతర రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో కూడా అధికారంలోకి వస్తుందని హోంమంత్రి అన్నారు. బీజేపీ తదుపరి రౌండ్ వృద్ధి దక్షిణ భారతదేశంలో ఉంటుంద‌ని తెలిపారు. దీని కోసం స‌మిష్టి ఆశ‌, అన్వేషణ‌, కృషి అవ‌స‌ర‌మంటూ పేర్కొన్నారు. 

Scroll to load tweet…

గుజరాత్ అల్లర్లపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని కేంద్ర హోం మంత్రి చెప్పార‌ని హిమంత బిశ్వ‌శ‌ర్మ అన్నారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవమని సుప్రీంకోర్టు ప్రకటించిందని, కోర్టు రాజకీయ స్ఫూర్తితో కూడినదని పేర్కొందన్నారు. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ గురించి కూడా హోం మంత్రి అమిత్ షా మాట్లాడ‌ర‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షం విభజించబడిందని తెలిపారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కాంగ్రెస్ సభ్యులు పోరాడుతున్నారని, అయితే భయంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదన్నారు. కాంగ్రెస్‌కు మోడీ ఫోబియా ప‌ట్టుకుంద‌ని తెలిపారు. అందుకే జాతీయ ప్రయోజనాల కోసం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నార‌ని ఆరోపించారు.

Read more:

PM Modi Hyderabad Visit: తెలంగాణలో త్వరలో కొత్త ప్రభుత్వం: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Earthquake: చైనాలో భూకంపం.. రిక్ట‌ర్ స్కేల్‌పై 5.2 తీవ్ర‌త న‌మోదు

ఫాస్ట్ గా బరువు తగ్గి.. స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి