MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • ఫాస్ట్ గా బరువు తగ్గి.. స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి

ఫాస్ట్ గా బరువు తగ్గి.. స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ను ఫాలో అయిపోండి

Weight Loss Women:  అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా బరువు పెరిగిపోతుంటారు. ఇక బరువు తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 03 2022, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బరువు పెరగడం సులువే.. కానీ బరువు తగ్గడం అంత సులువు కాదు. ఇది కష్టతరమైన ప్రక్రియ. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గే ప్రాసెస్ చాలా స్లోగా నడుస్తుంది. మగవారితో పోల్చితే అమ్మాయిలు తొందరగా బరువు తగ్గరు. ఎందుకంటే వీళ్లు ఎక్కువగా నడవరు. అయితే కొన్ని  సింపుల్ చిట్కాలను ఫాలో అయిపోతే సన్నని శరీరం మీ సొంతమవుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

బరువు తగ్గడానికి ప్లాన్ వేసుకోకండి

మీరు బరువు తగ్గాలనుకుంటున్నట్టైతే దానికి సంబంధించిన లక్ష్యాలను సెట్ చేసుకోకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఈ పూట ఇది చేయాలి. అది చేయకూడదు.. నెలకు ఇన్ని కిలోల బరువు తగ్గాలన్న విషయాలను ప్లాన్ చేసుకోవడం మానేయండి. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది. అందుకే ఒత్తిడికి గురికాకుండా మీరు సులువుగా బరువు తగ్గే ప్రాసెస్ ను మొదలు పెట్టండి.
 

39

శుద్ధి చేసిన ఆహారాలు, చక్కెర

షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు, ప్యాకేజ్ ఆహారాలు, పాస్తా, వైట్ బ్రెడ్, నూడుల్స్ వంటి ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శుద్ధి చేసిన పిండి పదార్థాల్లో పోషకాలు, ఫైబర్ తక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ ఆహారాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

49

ఆకుకూరలు

బచ్చలి కూర, కొత్తిమీర, కరివేపాకు , రోజ్మెరీ వంటి ఆకు కూరలు బరువు తగ్గేందుకు ఎంతో సహాయపడతాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు తోడ్పడుతాయి. అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి. జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడటంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. 

59

ప్రోటీన్లను ఎక్కువగా తీసుకోండి

బరువు తగ్గడానికి ప్రోటీన్ ఫుడ్ కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం చిక్కుళ్లు, గుడ్లు, మాంసం వంటి ఆహారాలను తినాలి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అతేకాదు జీవక్రియ రేటును కూడా పెంచుతాయి. బరువును కూడా తగ్గిస్తాయి. 
 

69

నీళ్లు ఎక్కువగా తాగాలి

నీళ్లు సర్వరోగ నివారిణి అంటారు ఆరోగ్య నిపుణులు. నీళ్లు పుష్కలంగా తాగితే బరువు పెరిగే అవకాశమే ఉండదు. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా మీరు చిరుతిళ్లను తినే అవకాశం లేకుండా చేస్తుంది. ఆకలి తగ్గుతుంది. ఇందుకోసం మీరు భోజనానికి 15 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి.
 

79

ఎక్కువగా నడవండి, తక్కువగా కూర్చోండి..

శరీరంలో ఉండే అదనపు కేలరీలు కరగాలంటే మీరు ఎక్కువగా నడవాలి. తక్కువగా కూర్చోవాలి.  ఇందుకోసం మీరు ఇంటి పనులను చేయడం, మెట్లు ఎక్కడం వంటివి చేయొచ్చు. తిన్న తర్వాత ఖచ్చితంగా కాసేపు నడవాలి. వీలు దొరికినప్పుడల్లా నడిస్తే సులువుగా బరువు తగ్గుతారు. 

89

స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించండి

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్లు ఉన్నాయి. రోజంతా ఫోన్లలో గడిపేవారు కూడా ఉన్నారు. కొంతమందైతే 24 గంటలూ ల్యాప్ టాప్ లేదా, టీవీలు చూస్తుంటారు. వీటి వినియోగాన్ని తగ్గించండి. తరచుగా నడవంటి. లేదంటే చిన్న చిన్న వ్యాయామాలను చేయండి. అలా అయితేనే మీరు బరువు తగ్గుతారు.

99

కంటినిండా నిద్రపోండి

బరువు తగ్గడానికి నిద్ర ఎంతో సహాయపడుతుంది. నిద్రలేకుంటే హార్మోన్లు గతితప్పుతాయి. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు ఇప్పటికే తేల్చి చెప్పాయి. అందుకే ప్రతిరోజూ రాత్రి ఖచ్చితంగా 7 నుంచి 8 గంటలు నిద్రపోండి. ఇది బరువు పెరిగే అవకాశాలను తగ్గిస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Watch: స్మార్ట్ వాచ్ రీడింగ్స్ ను నమ్మొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
Recommended image2
Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?
Recommended image3
Skincare Tips: ముఖం ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఉదయం ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved