దీదీ.. ‘‘మీ మేనల్లుడిని చంపితే మీరేం చేస్తారు’’.. బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

bjp leader nirmal chandra mandal comments on bengal CM mamta banerjee
Highlights

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత నిర్మల్ చంద్ర మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ-సీపీఎం కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో.. బిర్‌భూమ్‌లోని సూరిలో ఎస్‌పీ కార్యాలయం ఎదుట జరిపిన ప్రదర్శనలో చంద్ర మండల్ పాల్గొన్నారు

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ.. ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత నిర్మల్ చంద్ర మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో బీజేపీ-సీపీఎం కార్యకర్తల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో.. బిర్‌భూమ్‌లోని సూరిలో ఎస్‌పీ కార్యాలయం ఎదుట జరిపిన ప్రదర్శనలో చంద్ర మండల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ దీదీ.. మీ మేనల్లుడు హత్యకు గురైతే మీరేం చేస్తారంటూ..? నిలదీశారు. కేరళలో తమ కార్యకర్తలు హత్యకు గురైనప్పుడల్లా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఒక బీజేపీ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు చంపితే.. తాము ఇద్దర్ని చంపుతామని.. ఇప్పుడు కేరళ తరహా హింసే ఇక్కడ కూడా చోటు చేసుకుంటోందని అన్నారు.

మా నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ (అశుతోష్ ముఖర్జీ తనయుడు) తమకు చెప్పింది ఒకటే.. తప్పును ఖండించమన్నారు.. అవసరమైతే ప్రతీకారం తీర్చుకోమన్నారు.. మేమిప్పుడు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న హింసను మరింత రెచ్చగొట్టేలా చంద్ర మండల్ చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తూ తప్పు బట్టింది.a

loader