Asianet News TeluguAsianet News Telugu

‘జై శ్రీరామ్’ అంటూ బీజేపీ భయాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూచించినట్టు బీజేపీ నాయకులు ‘జై సియారాం’ అని ఎందుకు పలకరని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. జై శ్రీరాం అంటూ బీజేపీ భయాన్ని నెలకొల్పుతోందని ఆరోపించారు. 

BJP is inciting fear and anger by saying 'Jai Shri Ram' - Rajasthan CM Ashok Gehlot
Author
First Published Dec 25, 2022, 3:58 PM IST

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై శనివారం విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో గెలవడానికి ఆ పార్టీ నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. కాషాయ శిబిరం ‘జై శ్రీరామ్’ అని చెప్పడం వల్ల భయం, కోపాన్ని కలిగిస్తోందని అన్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సూచించినట్లు వారు (బీజేపీ) ‘జై సియారాం’ అని ఎందుకు అనరని ప్రశ్నించారు.

‘‘ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ ఆటలు ఆడుతోంది. ‘జై సియారాం’ అని అనాలని రాహుల్ గాంధీ సూచించినా ఎందుకు అనడం లేదు. దేశం మొత్తం సీతా మాతను గౌరవిస్తుంది. ‘జై శ్రీరామ్’ అంటూ ప్రజలను రెచ్చగొట్టి భయాన్ని, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వారు (బీజేపీ) రాముడు, సీతాదేవిని విభజించారు’’ అని అశోక్ గెహ్లాట్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు.

చైనా, భారత్ సరిహద్దు సుస్థిరత కాపాడేందుకు కట్టుబడి ఉన్నాం: చైనా విదేశాంగ మంత్రి

ఈ నెల ప్రారంభంలో రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారు. అందులో భాగంగా బగ్డి అనే గ్రామంలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ మహిళలను అణిచివేస్తోందని ఆరోపించారు. ఆ సంస్థకు మహిళా సభ్యులు లేకపోవడానికి అదే కారణమని పేర్కొన్నారు.

‘‘మీకు ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలు కనిపించరు. వారు మహిళలను అణచివేస్తారు. ఆ సంస్థలోకి వారిని అనుమతించరు.’’ అని తెలిపారు. ‘‘ నేను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని నాయకులను ఓ విషయం అడగాలని అనుకుంటున్నాను. మీరు జై శ్రీరామ్ అంటారు కానీ మీరు ఎందుకు జై సియారామ్ అని అనరు ? సీతామాతను ఎందుకు తొలగించారు ? మీరు ఆమెను ఎందుకు అవమానించారు ? మీరు భారతదేశంలోని మహిళలను ఎందుకు అవమానించారు ? ’’ అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. 

ముమ్మ‌రంగా కోవిడ్-19 ప‌రీక్ష‌లు.. క‌రోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: నితీష్ కుమార్

కోవిడ్ ప్రొటో కాల్ ను పాటించాలని, లేకపోతే భారత్ జోడో యాత్రను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్‌లకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. ఈ పరిణామం చోటు చేసుకున్న నాటి నుంచి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శల వర్షం కురిపిస్తోంది. ఈ లేఖ ఒక్క సారిగా రాజకీయ దుమారాన్ని రేపింది. దీంతో మాండవీయ స్పందించారు. 

రామ సేతుపై బీజేపీ ప్రజలను తప్పుదారి పట్టించింది.. క్షమాపణలు చెప్పాలి: ఛత్తీస్‌గడ్ సీఎం

“ఇది అస్సలు రాజకీయం కాదు. నేను ఆరోగ్య మంత్రిని. ఈ విషయంలో శ్రద్ధ వహించాల్సిన బాధ్యత నాపై ఉంది. కోవిడ్ -19 నియమాలను పాటించాలని చెప్పాల్సిన అవసరం నాకుంది ’’ అని మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈ లేఖపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఆదివారం స్పందించారు. బీజేపీని విమర్శించారు. కోవిడ్ ఎక్కడా లేదని, కానీ అధికారిక బీజేపీ భయాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. భారత్ జోడో యాత్రను చూసి కాషాయ పార్టీ భయపడుతోందని, దానిని ఆపేందుకు కోవిడ్ ను ఒక సాకుగా చూపెడుతోందని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios