Asianet News TeluguAsianet News Telugu

ముమ్మ‌రంగా కోవిడ్-19 ప‌రీక్ష‌లు.. క‌రోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: నితీష్ కుమార్

Patna: భారతదేశంలో గత 24 గంటల్లో 227 కొత్త క‌రోనా వైర‌స్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో కోవిడ్-19 యాక్టివ్ కేసుల‌ సంఖ్య ఇప్పుడు 3,424 కి చేరుకుందరి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. 
 

Corona virus: intensive covid-19 tests, vaccination process: Bihar CM Nitish Kumar
Author
First Published Dec 25, 2022, 3:29 PM IST

coronavirus: ప‌లు దేశాల్లో ప్ర‌స్తుతం క‌రోనావైర‌స్ కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టంతో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనావైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప‌లు సూచ‌న‌లు సైతం చేసింది. తాజాగా  చైన‌లో క‌రోనా ఉద్ధృతికి కార‌ణ‌మైన బీఎఫ్.7 వేరియంట్ కేసులు భార‌త్ లోనూ గుర్తించ‌డంతో అధికార యంత్రంగం అల‌ర్ట్ అయింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం తాము అల‌ర్ట్ మోడ్ లో ప‌నిచేస్తున్నామ‌ని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్ మాండవీయా తెలిపారు. రానున్న పండ‌గ సీజ‌న్ ను దృష్టిలో ఉంచుకుని చ‌ర్య‌లు తీసుకోవాల‌నీ, ప్ర‌జ‌లు కోవిడ్-19 మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని కోరారు. 

బీహార్ ప్ర‌భుత్వం సైతం రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. దీని కోసం క‌రోనా రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ముమ్మ‌రంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌భుత్వం పేర్కొంది. ప్రతిరోజూ 45,000-50,000 క‌రోనా పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, పెద్ద సంఖ్య‌లో వ్యాక్సిన్‌లు ఇస్తున్నామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చెప్పారు. ఆదివారం నాడు సీఎం నితీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. "మేము భారీ సంఖ్య‌లో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాము. ముమ్మ‌రంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాలు కొన‌సాగిస్తున్నాము. ప్రతిరోజూ దాదాపు 45,000-50,000 పరీక్షలు నిర్వహిస్తున్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌ట్ల బీహార్ అప్రమత్తంగా ఉంది. రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము.  బ‌య‌ట (ఇత‌ర దేశాలు) నుంచి వ‌చ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నాము.. " అని తెలిపారు.

బీహార్‌లో కరోనా కొత్త వేరియంట్ రాకముందే అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. కరోనా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కోరారు. దీనితో పాటు, పరీక్ష, విచారణకు సంబంధించిన సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. బీహార్‌లో ప్రస్తుతం కరోనా జీరోగా ఉందని, అయితే ఇక నుంచి అప్రమత్తంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. కేంద్రం కూడా అలర్ట్ అవుతోంది.. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బయటి నుంచి వచ్చిన వారిని విచారించాలనీ, అందుకు విచారణకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..

"రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా విచారణ జరుపుతున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దీనితో పాటు, ఇతర ప్రదేశాల కంటే కరోనా వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ ఎక్కువగా జరిగింది. ఇందులో మేమెప్పుడూ వెనుకంజ వేయలేదు. అయితే, దేశంలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అందుకే బీహార్‌లో కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి" అని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వ‌చ్చిన క్ర‌మంలో పై వ్యాఖ్య‌లు చేశారు. "అటల్ జీ అంటే నాకు గౌరవం ఉంది.. చాలా నమ్మకం ఉంది. అటల్ జీ నన్ను ఎంతగా పరిగణించేవారో ఎప్పటికీ మర్చిపోలేం.." అంటూ పేర్కొన్నారు. అటల్ జీని మనం ఎప్పటికీ మరిచిపోలేమని తెలిపారు.  దేశానికి ఆయన చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios