Asianet News TeluguAsianet News Telugu

బీహార్ ఎన్డీఏ కూట‌మిలో తారాస్థాయికి విభేదాలు.. రేపు జేడీ(యూ) లీడ‌ర్ల‌తో నితీష్ కుమార్ మీటింగ్

బీహార్ ఎన్డీఏ కూటమిలో విభేదాలు నెలకొన్నాయి. బీజేపీని టార్గెట్ చేస్తూ ఇటీవల జేడీ(యూ) నాయుకులు ప్రెస్ మీట్ పెట్టారు. తాజాగా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించాలని నితీష్ కుమార్ నిర్వహించారు. రేపు జరగబోయే సమావేశం అనంతరం బీహార్ కూటమి భవితవ్యంపై స్పష్టత వస్తుంది. 

Bihars NDA alliance has reached its peak.. Nitish Kumar's meeting with JD(U) leaders tomorrow
Author
Patna, First Published Aug 8, 2022, 10:56 AM IST

బీహార్ ఎన్డీఏ కూట‌మిలో ముస‌లం నెల‌కొంది. సీఎం నితీష్ కుమార్ కు చెందిన జేడీ(యూ), బీజేపీకి మ‌ధ్య గ‌త కొంత కాలంగా పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయ‌ని ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిర్గ‌తం అయ్యాయి. తాజాగా ఈ రెండు పార్టీల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోబోతున్నారనే ఊహాగానాలు నెల‌కొన్న నేప‌థ్యంలో జనతాదళ్ (యునైటెడ్)కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో మంగళవారం స‌మావేశం ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఈ స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. 

అదనపు కట్నం వేధింపులు.. డ్రగ్స్ మత్తులో భార్య తలపై మూత్రవిసర్జన, చిత్రహింసలు..

అస‌లేం జ‌రిగిందంటే ? 
కేంద్ర మంత్రివర్గంలో వాటా విషయంలో జేడీయూ, బీజేపీ మధ్య మొద‌ట‌గా వివాదం మొదలైంది. బీజేపీ టోకెన్ వాటా ప్రతిపాదనను JDU తిరస్కరించినా.. ఆ పార్టీ అధ్య‌క్షుడు RCP సింగ్ కేంద్ర మంత్రి అయ్యారు. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఉంటూ కేంద్ర మంత్రివ‌ర్గంలో కొన‌సాగుతున్నారు. అయితే గత నెలలో నితీష్ కుమార్ పార్టీ RCP సింగ్‌కు రాజ్యసభ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆర్ సీపీ సింగ్ జేడీయూకి శ‌నివారం గుడ్‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను కేంద్ర మంత్రిని అయినందున త‌న‌పై కుట్ర జరుగుతోందని అన్నారు. అసూయకు మందు లేదని మాత్ర‌మే చెబుతాన‌ని పేర్కొన్నారు. నితీష్ కుమార్‌పై దాడి చేసిన ఆర్ సీపీ సింగ్ ‘‘ నితీష్ కుమార్ తన ఏడు జన్మలలో దేనిలోనూ ప్రధాని కాలేడు’’ అని తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

నిర్భ‌య చ‌ట్టం త‌రువాతే అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌లు పెరిగాయి - రాజ‌స్థాన్ సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

RCP సింగ్ చేసిన వ్యాఖ్య‌లకు కౌంట‌ర్ ఇచ్చేందుకు నితీష్ కుమార్ త‌న ముఖ్య నాయ‌కుల‌ను ఆదివారం మీడియా ముందుకు పంపించారు. ఆర్పీసీ అక్ర‌మ ఆస్తులు ఒప్పందాల‌పై జేడీ(యూ) నేత‌లు విమ‌ర్శించారు. JD(U) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్ ఆర్సీపీ సింగ్ ను తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. బీజేపీపై కూడా ఆరోప‌ణ‌లు గుప్పించారు. ‘‘ ఆర్సీపీ సింగ్ కు కేంద్ర కేబినెట్‌లో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది. మేము కేంద్ర మంత్రివర్గంలో భాగం కాబోమని 2019లోనే ముఖ్యమంత్రి నిర్ణయించారు. రానున్న కాలంలో కూడా జేడీయూకు కేంద్ర మంత్రి వ‌ర్గంలో భాగం కావాల‌ని లేదు ’’ అని ఆయన తెలిపారు. 

ఈ ప‌రిస్థితితుల్లో ఇటీవ‌ల ఢిల్లీలో జ‌రిగిన నీతి ఆయోగ్ స‌మావేశానికి నితీష్ కుమార్ దూరంగా ఉన్నారు. త‌న గైర్హాజ‌రుకు అనారోగ్య కార‌ణాల‌ను ఎత్తిచూపారు. ఈ స‌మావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో పాటు 23 మంది ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అయితే ఈ స‌మావేశానికి నితీష్ కుమార్ డుమ్మా కొట్టి బీజేపై నిర‌స‌న వ్య‌క్తం చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేశారు.

‘చిలుకతో చచ్చే చావొచ్చింది.. అరెస్ట్ చేయండి సార్’.. పోలీస్ స్టేషన్ లో వృద్ధుడి ఫిర్యాదు..

కాగా.. కేంద్రంలో మంత్రి పదవి కోసం మోడీ ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపారనే ఆరోపణలను ఆర్‌సీపీ సింగ్ ఖండించారు. మంత్రివర్గ విస్తరణపై హోంమంత్రి అమిత్ షా నితీష్ కుమార్‌తో మాట్లాడారని అన్నారు. త‌న‌కు కేంద్ర మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios