Asianet News TeluguAsianet News Telugu

నిర్భ‌య చ‌ట్టం త‌రువాతే అత్యాచారం, హ‌త్య ఘ‌ట‌న‌లు పెరిగాయి - రాజ‌స్థాన్ సీఎం వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

అత్యాచారాలపై రాజస్థాన్ సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత అత్యాచారానికి గురైన బాధితులను మర్డర్ చేసే ఘటనలు పెరిగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

Incidents of rape and murder increased after Nirbhaya Act - Rajasthan CM's controversial comments
Author
New Delhi, First Published Aug 8, 2022, 9:04 AM IST

నిర్భ‌య ఘ‌ట‌న జ‌రిగి, దోషులకు ఉరి శిక్ష వేసే చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చిన త‌రువాత దేశంలో రేప్, మ‌ర్డర్ క‌ల్చ‌ర్ మ‌రింతగా పెరిగింద‌ని, ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఎక్కువ అవుతున్నాయ‌ని రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్ర‌స్తుతం వివాదంగా మారాయి. నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ‘బ్లాక్ ప్రొటెస్ట్’ పేరిట ఆందోళ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అశోక్ గెహ్లాట్ ఈ విధంగా మాట్లాడారు. 

‘చిలుకతో చచ్చే చావొచ్చింది.. అరెస్ట్ చేయండి సార్’.. పోలీస్ స్టేషన్ లో వృద్ధుడి ఫిర్యాదు..

నిర్భ‌య అత్యాచార ఘ‌ట‌న త‌రువాత దేశంలో ప్ర‌జ‌ల మూడ్ మొత్తం మారిపోయింద‌ని అన్నారు. రేప్ చేసిన వారిని ఉరేయాల‌నే డిమాండ్ పెరిగింద‌ని చెప్పారు. దాని త‌రువతే ఈ కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింద‌ని తెలిపారు. అప్ప‌టి నుంచే రేప్ చేసిన త‌రువాత బాధితులను చంపేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్పుడు ఈ డేంజ‌ర‌స్ ట్రెండ్ దేశంలో కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ స్పందించింది. ఆయ‌న‌ను తీవ్రంగా విమ‌ర్శించింది. రాష్ట్రంలో అమాయక బాలికలపై పెరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాలను దాచిపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని విమ‌ర్శించింది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా దీనిపై వ్యాఖ్యానిస్తూ.. సీఎం ప్రకటన దురదృష్టకరమని అన్నారు. “ గత మూడేళ్లలో రాజస్థాన్ అమాయక యువతులపై అఘాయిత్యాలకు కేంద్రంగా మారింది. తమ వైఫల్యాలను దాచుకునేందుకు వివాదాస్పద ప్రకటనలు చేస్తూ సమస్యను వక్రీకరించడం దురదృష్టకరం. ’’ అపి అన్నారు. 

Amarnath Yatra: యాత్రికుల సంఖ్య తగ్గడంతో జమ్మూ నుంచి అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

కాగా.. అశోక్ గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ త‌న వ్యాఖ్య‌ల‌ను మ‌రో సారి స‌మ‌ర్థించుకున్నారు. తాను నిజం మాత్రమే మాట్లాడుతున్నానని అన్నారు. “ నేను నిజం మాత్రమే చెప్పాను. ఒక మ‌హిళ‌పై కొంద‌రు అత్యాచారానికి ఒడిగ‌ట్టిన‌ప్పుడు.. బాధితురాలు త‌మ‌ని గుర్తించి త‌రువాత శిక్షకు గురి చేస్తార‌నే భ‌యంతోనే వాళ్లు ఇలా హ‌త్య‌లు చేస్తున్నార‌ని చెప్పారు. .ఇంతకు ముందు ఎన్నడూ ఇంత మరణాలు జరగలేదు ”  అని అన్నారు.

బీజేపీ అంటే అవినీతి, కల్తీ మద్యం: ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ విమ‌ర్శ‌లు

అయితే అశోక్ గెహ్లాట్ వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవ్వ‌డంతో ఆయ‌న OSD లోకేశ్ శర్మ మీడియాతో స్పందించారు. దేశంలో రేప్ ఘ‌ట‌న‌లు, హ‌త్య‌లు పెరిగిపోతున్న త‌రుణంలో ముఖ్య‌మంత్రి ఆందోళ‌న‌ల‌తో ఇలాంటి మాట‌లు మాట్లాడారిన అన్నారు. ఇందులో ఇలాంటి దురుద్దేశ‌మూ లేద‌ని అన్నారు. గెహ్లాట్ మాటల్లో బాధ‌ను అంద‌రూ అర్థం చేసుకోవాల‌ని, వివాదం చేయొద్ద‌ని కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios