బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుగురు చిన్నారుల మృతి

bihar road accident
Highlights

మరో నలుగురికి తీవ్ర గాయాలు.

ఓ చిన్నారిని కాపాడాలనుకుని ఓ డ్రైవర్ చేసిన ప్రయత్నం మరో ఆరుగురు చిన్నారులు బలితీసుకుంది. రోడ్డుపై కారుకు అడ్డంగా వచ్చిన చిన్నారిని తప్పించడానికి ప్రయత్నించి ఓ పెళ్ళి బృందం ప్రమాదానికి గురయ్యింది. అదుపుతప్పిన కారు చెరువులో పడటంతో ఇందులో ఉన్న ఆరుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయారు. ఈ ప్రమాదం ఇవాళ ఉదయం బీహార్‌లోని అరారియా జిల్లాలో చోటుచేసుకుంది. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. అరారియా జిల్లాలో ఓ పెళ్లి బృందం స్కార్పియో వాహనంలో వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జిల్లాలోని దబ్రా గ్రామ సమీపంలోకి వాహనం రాగానే ఓ చిన్నారి హటాత్తుగా అడ్డుగా వచ్చింది. దీంతో ఆ చిన్నారిని తప్పించబోయి వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పడింది.  దీంతో అందులో ప్రయాణిస్తున్నఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. మరో నలుగురు పెద్దవారు కూడా తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బైటికి తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉండడంతో విషాద వాతావరణం నెలకొంది.


 

loader