బిహార్‌లో ఓ వివాహిత తన బ్యాచిలర్ లవర్‌తో ఇంటిలో పట్టుబడింది. ఆ వ్యక్తిని ఆమె బంధువులు పట్టుకుని కొట్టగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతడిని తీసుకెళ్లగా ఆమె కూడా వెంబడించింది. అక్కడ ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నాక.. ఆ యువకుడిని వదిలిపెట్టారు. కాగా, తనకు తన బ్యాచిలర్ లవరే కావాలని ఆమె పట్టుబడి స్టేషన్ ముందు రెండు గంటలపాటు రచ్చ చేసింది. 

పాట్నా: బిహార్‌లో ఓ వివాహిత ప్రవర్తన అందరికీ వింతగా తోచింది. బంధువులకు, ఆప్తులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. పెళ్లై.. పిల్లలు పుట్టిన తర్వాత లవర్‌తో ఇంటిలో పట్టుబడింది. బంధువులు అతడిని కొడుతూ ఉంటే ఆమె వారించింది. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె లవర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అది వివాహేతర సంబంధంగా కనిపించడంతో పోలీసులు ఇరు పక్షాలను రమ్మన్నారు. పోలీసు స్టేషన్ ముందే తనకు తన లవర్ కావాలని ఆమె రచ్చ చేసింది. కనీసం రెండు గంటలపాటు హై వోల్టేజ్ డ్రామా నడిపినట్టు జీ న్యూస్ ఆంగ్ల వెబ్ సైట్ ఓ కథనం ప్రచురించింది. దీంతో ఆమె అత్తమామలకు చిర్రెత్తుకొచ్చింది.

ఈ ఘటన బిహార్‌లోని రొహతాస్‌లో జరిగింది. ఆ వివాహిత, తన భర్త, ఒక చిన్నారితో జీవిస్తున్నది. అయితే, ఆమె తన లవర్‌తో ఇంటిలోనే పట్టుబడింది. ఆమె లవర్ కైమూర్ జిల్లా బాబువాకు చెందినవాడు. ఆమె బంధువులు వెంటనే ఆ వ్యక్తి చితక్కొట్టడం ప్రారంభించారు. కానీ, ఆమె వారించింది. వారు వినలేదు. దీంతో ఆమె ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పాట్‌కు వచ్చారు. ఆమె లవర్‌ను కస్టడీలోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తన బ్యాచిలర్ లవర్‌ను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లగానే.. ఆమె కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లిపోయింది. ఇది వివాహేతర సంబంధంలా ఉన్నదని పోలీసులు ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిచారు. స్టేషన్‌లో ఆ రెండు కుటుంబాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె లవర్‌ను పోలీసులు తమ కస్టడీలో నుంచి విడిచి పెట్టారు.

Also Read: ఇదేం ప్రేమరా బాబోయ్.. పెళ్లై, పిల్లలు ఉండి.. మరో వివాహితను భర్తముందే ప్రేమించమని వేధించి.. చివరికి..

ఆ తర్వాత తన లవర్, ఆయన కుటుంబంతో కలిసి కారులో బాబువాకు బయల్దేరారు. ఇది గమనించిన ఆమె ఆ కారును ఆపేశారు. దాని ముందు నిలిచి గలాటాకు ప్రయత్నించింది. దాదాపు రెండు గంటలపాటు అక్కడ హై డ్రామా నడిచింది. అయితే, ఆమె బాయ్‌ఫ్రెండ్ కుటుంబం ఎలాగోలా ఆ యువకుడిని రహస్యంగా అక్కడి నుంచి తరలించేసింది. 

ఇదిలా ఉండగా, అత్తింటివారి కుటుంబం ఆమెను మళ్లీ ఇంటికి తీసుకువెళ్లడానికి నిరాకరించారు. పోలీసులూ చూస్తూనే ఉండిపోయారు. చివరకుు ఆ వివాహిత తల్లి ఇంటికి ఫోన్ చేశారు. వారిని పిలిపించి వారితో ఆ వివాహితను పంపించేశారు. పోలీసు స్టేషన్ ముందు గంటలపాటు సాగిన హై వోల్టేజ్ డ్రామా చివరకు ముగిసిపోయింది.