Asianet News TeluguAsianet News Telugu

ఇదేం ప్రేమరా బాబోయ్.. పెళ్లై, పిల్లలు ఉండి.. మరో వివాహితను భర్తముందే ప్రేమించమని వేధించి.. చివరికి..

పెళ్లైన ఓ వ్యక్తి.. మరో వివాహితను ప్రేమించాడు. ఆమెను ప్రేమించమంటూ భర్తముందే వేదించాడు. ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. 

married man committed suicide over married woman refused his love in karnataka
Author
First Published Dec 20, 2022, 10:40 AM IST

కర్ణాటక : ఓ వ్యక్తి ఆత్మహత్య ఇప్పుడు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో చర్చనీయాంశంగా మారింది. అతనికి పెళ్లయి పిల్లలు ఉన్నారు. కానీ, మరో వివాహితను ప్రేమించానని వెంటపడ్డాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో మనస్థాపంతో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. చిక్కబళ్లాపురం నగరంలోని కోటె ప్రాంతంలో నివాసముంటున్న నవీన్ (27)కు పెళ్లయింది. కార్పెంటర్ గా పని చేస్తున్నాడు. 

అతనికి దాని వల్ల వచ్చే ఆదాయంతో ప్రశాంతంగా జీవితం గడిచిపోయేది. అయితే, ఇంతలో అతనికి చెడుబుద్ది పుట్టుంది. అతని ఇంటి సమీపంలోనే ఓ వివాహిత మీదికి మనసు మళ్లింది. ఆమెను ప్రేమించాలంటూ వేధించేవాడు. అతడి ప్రవర్తన ఆమెకి నచ్చలేదు.  పెళ్లిళ్లు అయిన తర్వాత ఈ గొడవ ఏంటంటే ఆమె తిరస్కరించింది. ఆమెను ప్రేమించడంతో అతను ఆగలేదు. ఏకంగా సదరు మహిళ ఇంటికి వచ్చి భర్త ఎదుటే హింసించడం మొదలుపెట్టాడు. 

ప్రియురాలి భర్తను చంపి, అతడి ఇంట్లోనే శవాన్ని పాతిపెట్టిన ప్రియుడు.. మద్యం మత్తులో చెప్పేయడంతో..

ఆమెను ప్రేమించాలంటూ వేధించేవాడు. తనముందే తన భార్యను అలా అడగడంతో భర్త  గొడవపడ్డాడు. ఈ ఘటనతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా కూడా నవీన్ తన ప్రయత్నం మానుకోలేదు. ఇటీవల ఆమె ఇంటికి మళ్లీ వెళ్లాడు. తనను ప్రేమించాలని మళ్లీ వేధించాడు. లేకపోతే తాను చనిపోతానని బెదిరించాడు. దానికి ఆమె వినకపోతే.. ఆమె ఎదురుగానే బాటిల్ తో తల మీద కొట్టుకున్నాడు. 

చేతిమీద ఆమె పేరు కూడా చెక్కించుకున్నాడు. మరోవైపు నవీన్ తల్లి కాశీ యాత్రకు వెళ్లడంతో.. ఆమె ఇంట్లో ఎవరూ లేరు. తాను ఎంత ప్రయత్నించినా వివాహిత వినకపోవడంతో తీవ్రమైన మనస్తాపంతో  తల్లి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నగర పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా, నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. రెండేళ్ల చిన్నారిపై కన్నతల్లి కర్కశంగా ప్రవర్తించి అంత్యంత దారుణంగా హతమార్చింది. చెంపలు పగలగొట్టి, గోడకేసి విసిరికొట్టింది. అప్పటికీ చనిపోకపోవడంతో ముక్కు, నోరు మూసి చిన్నారికి నరకం చూపించి.. ఊపిరాడకుండా చేసి చంపేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఆ చిన్నారిని నవమాసాలు మోసి కన్న తల్లే.. తన ప్రియుడితో కలిసి కర్కశంగా ప్రాణాలు తీసింది. ఆ తర్వాత మూర్చతో చనిపోయిందంటూ కథలు అల్లింది. 

ఎట్టకేలకు హత్య విషయం బయటపడడంతో కన్నతల్లిని, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు దీనికి సంబంధించి నల్గొండ డిఎస్పీ నరసింహారెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. కనగల్ మండలం లచ్చగూడెంకి చెందిన రమ్యకు.. చిట్యాల మండలం ఎలికట్టె గ్రామానికి చెందిన ఉయ్యాల వెంకన్నతో 2015లో పెళ్లయింది. వీరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. కొడుకు శివరాం అయిదేళ్ల వాడు. కూతురు ప్రియాన్షిక  రెండేళ్లది. 

Follow Us:
Download App:
  • android
  • ios