Asianet News TeluguAsianet News Telugu

ఘనంగా భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారోత్సవం.. హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ మరో సారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మంత్రి వర్గంలో 25 మందికి అవకాశం లభించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ రాష్ట్రాల సీఎంలు, బీజేపీ నాయకులు హాజరయ్యారు. 

Bhupendra Patel's swearing-in ceremony was grandly attended by Prime Minister Modi and Amit Shah
Author
First Published Dec 12, 2022, 4:18 PM IST

గుజరాత్ సీఎంగా బీజేపీ సీనియర్ నాయకుడు భూపేంద్ర పటేల్ రెండో సారి ప్రమాణస్వీకారం చేశారు. ఏడో సారి బీజేపీ అధికారం చేపడుతున్న నేపథ్యంలో ఈ వేడుకులను ఘనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు.

కోల్ కత్తాలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు..

రాష్ట్రంలో బీజేపీ చారిత్రాత్మకమైన పాలనకు గుర్తుగా జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో భూపేంద్ర పటేల్‌తో పాటు మరో 25 మంది ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు.  ఈ సమయంలో కార్యకర్తల హర్షధ్వానాలు చేస్తూ వారిని ఉత్సాహపరిచారు. కొత్త కేబినేట్ లో మంత్రులుగా బీజేపీ నేతలు నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి, జగదీష్ విశ్వకర్మ, ప్రఫుల్ పన్షేరియా, భిఖుసిన్హ్ పర్మార్ మరియు కున్వర్జీ హల్పతి ప్రమాణస్వీకారం చేశారు.

పుదుచ్చేరిలో ద్రవిడియన్ మోడల్ ఉండాలి.. ఇక్కడ గవర్నర్ చెప్పుచేతల్లో సీఎం: ఎంకే స్టాలిన్

గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలియజేశారు. ఈ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన వేధికపై ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, కర్ణాటక బీజేపీ నేత బీఎల్ సంతోష్, హోం మంత్రి అమిత్ షాతో కూర్చున్నారు. 

గుజరాత్ లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 182 స్థానాలకు గాను 156 స్థానాలను గెలుచుకొని కాషాయ పార్టీ రికార్డు నెలకొల్పింది. అయితే 1960లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ పార్టీ కూడా ఇన్ని స్థానాలు గెలుచుకోలేదు. గత 29 ఏళ్లుగా బీజేపీకి గుజరాత్ కంచుకోటగా ఉంది.  కాగా.. గతేడాది సెప్టెంబర్ లో మొదటి సారిగా భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకు ముందు విజయ్ రూపానీ సీఎంగా ఉన్నారు.

ఉడుపీ జైలులో విచారణ ఖైదీ ఆత్మహత్య... శిక్ష పడుతుందన్న భయంతోనే.. 

కాగా.. ఈ వేడుకలకు ప్రధాని, హోం మంత్రిలతో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కర్ణాటక ముఖ్యమంత్రి బి బొమ్మై, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, గుజరాత్ బీజేపీ నేత వాజుభాయ్ వాలా, కర్ణాటక బీజేపీ నేత బీఎల్. సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అయితే పటేల్, ఆయన కొత్త మంత్రివర్గాన్ని ఆశీర్వదించడానికి గుజరాత్ నుండి 200 మందికి పైగా సాధువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios