Asianet News TeluguAsianet News Telugu

ఉడుపీ జైలులో విచారణ ఖైదీ ఆత్మహత్య... శిక్ష పడుతుందన్న భయంతోనే..

శిక్ష ఎక్కువగా పడుతుందన్న భయంతో విచారణలో ఉన్న ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడుపీ జైలులో జరిగింది. 

Undertrial prisoner committed suicide at jail in Karnataka
Author
First Published Dec 12, 2022, 2:05 PM IST

కర్ణాటక : కర్ణాటక జైల్లో విచారణ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఉడిపిలోని ఓ జైల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. జులై 12న జరిగిన ఓ హత్య కేసులో అతను విచారణ ఖైదీగా జైల్లో ఉన్నాడు. జులై 12న కార్కళకు చెందిన ఆనంద దేవాడిగ అనే వ్యక్తిని .. ఉడిపి ఒత్తినెణె సమీపంలోని హేనబేరు రోడ్డులో కారుతో సహా నిప్పు పెట్టి హతం చేశారు. ఈ కేసులో సదానంద, అతని స్నేహితురాలు శిల్ప నిందితులుగా ఉన్నారు. వీరు అతడిని కారులో రమ్మని పిలిచి, వచ్చాక నిద్రమాత్రలు ఇచ్చి కారుకు నిప్పు పెట్టారు. 

ఈ ఘటనకు సంబంధఇంచిన కేసులోనే సదానంద ఉడిపి జైలులో 20 మంది ఖైదీలతో ఓ బ్యారెక్ లో ఉన్నాడు. ఆదివారం తెల్లవారుజామున బారక్ లోనే పంచెతో ఉరి వేసుకుని మరణించాడు. అది చూసిన మిగతా ఖైదీలు.. జైలు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు సందానందను హుటాహుటిన ఆస్పత్రికి  తరలించారు. అయితే, మార్గమధ్యలోనే సదానంద మృతి చెందాడు. అయితే, హత్య కేసులో సదానందకు శిక్షను కోర్టు ఖరారు చేయనుంది. దీంతో శిక్ష ఎక్కువ పడుతుందన్న భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రమాణస్వీకారం.. ఆయన నేపథ్యం ఏంటంటే ?

Follow Us:
Download App:
  • android
  • ios