Asianet News TeluguAsianet News Telugu

కర్నూలులో బాబుకు చేదు అనుభవం.. రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు...

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు విషయంలో చంద్రబాబు వైఖరి తెలపాలంటూ న్యాయవాదులు చంద్రబాబు బస చేసిన హోటల్ ముందు ధర్నాకు దిగారు.

Go back Chandrababu slogans Resound In Kurnool
Author
First Published Nov 18, 2022, 1:29 PM IST

కర్నూలు :  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసిన హోటల్ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్డౌన్ అంటూ నిరసన చేపట్టారు. 

న్యాయ రాజధానిని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం న్యాయ రాజధానిని అంగీకరించాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు..ఇక్కడ అడుగుపెట్టిన అధికారం లేదని న్యాయవాదుల సంఘం హెచ్చరించింది. 

ఇదిలా ఉండగా, నవంబర్ 3న ఏపీ హైకోర్టు మూడు రాజధానుల మీద సీరియస్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని తాము స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు మూడు రాజధానులకు అనుకూలంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇలాంటి చర్యలు అభినందించదగినవి కావు అని వ్యాఖ్యానించింది. హైకోర్టు ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి అధికారం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కర్నూలులో హైకోర్టు కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం సరికాదు అంది. ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇస్తుందని ప్రశ్నించింది. 

టీడీపీ నేత శేషగిరిరావుపై దాడి చేసిన నిందితుడి ఆచూకీ చెబితే రూ. 20 వేల రివార్డు: కాకినాడ పోలీసులు

రాజధాని అమరావతి అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక.. అదే అంశంపై రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించింది. ఇలాంటివన్నీ రైతులను ముందుంచి  నిర్వహించే రాజకీయ పాదయాత్ర అని వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఎస్ఎల్ పీలు దాఖలు అయ్యాయని గుర్తు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయం కోసం వేచి చూడాలని చెప్పుకొచ్చింది. రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు బిజీగా ఉందని, ఇలాంటి చర్యలు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం కోసమే అని భావిస్తున్నామంది. 

పాదయాత్ర వ్యవహారమై అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన షరతులతో  తమకు సంఘీభావం తెలియజేసే హక్కు లేకుండా పోతోందని పేర్కొంటూ ‘అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య’, ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’  కార్యదర్శి ధనేకుల రామారావు అక్టోబర్ 27న అప్పీళ్లను దాఖలు చేశారు. వీటిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా  ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులపై థర్డ్ పార్టీ అయిన మీరు ఎలా అప్పీలు వేస్తారు?  అన్ని ప్రాథమిక  అభ్యంతరం లేవనెత్తింది. 

ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కోర్టు ఫైల్ లోకి చేరకపోవడంతో విచారణను ఈ నెల ఏడుకి వాయిదా వేసింది. కౌంటర్ దస్త్రాన్ని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios