Asianet News TeluguAsianet News Telugu

భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు సంజీవ‌ని.. ఈ యాత్ర‌తో పార్టీ దూకుడుగా వ్య‌వ‌హరిస్తుంది - జైరాం ర‌మేష్

భారత్ జోడోయాత్రతో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ అన్నారు. ఈ యాత్ర పార్టీకి సంజీవని వంటిందని చెప్పారు. 

Bharat Jodo Yatra is Sanjeeva for Congress.. Party will deal aggressively with this Yatra - Jairam Ramesh
Author
First Published Sep 8, 2022, 3:00 PM IST

భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు సంజీవ‌ని వంటిద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ లీడ‌ర్ జైరాం ర‌మేష్ అన్నారు. ఈ యాత్ర‌తో పార్టీ దూకుడుగా వ్య‌వ‌హరిస్తుంద‌ని, కొత్త‌గా క‌నిపించ‌నుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల పాద‌యాత్ర‌ను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ యాత్ర నేప‌థ్యంలోనే జైరాం ర‌మేష్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడారు.  

‘‘ ఈ భారత్ జోడో యాత్ర కాంగ్రెస్‌కు సంజీవని వంటిదని నాకు 100 శాతం నమ్మకం ఉంది. ఇది ప్రాణదాత. ఇది కాంగ్రెస్‌ను పునరుద్ధరించబోతోంది. ఇది కాంగ్రెస్‌ను కొత్త అవతార్ గా పునరుద్ధరిస్తుంది.’’ అని జైరాం రమేష్ అన్నారు. 137 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్నో అవతారాలు ఎత్తింద‌ని, ఇప్పుడు మ‌రో కొత్త అవ‌తారం ఎత్త‌బోతోంద‌ని తెలిపారు.

భ‌యంతో లోయను వ‌దిలిన పండిట్ల‌లో కొంత మందే తిరిగొస్తున్నారు - ప్ర‌ముఖ రాజ‌కీయ‌వేత్త క‌ర‌ణ్ సింగ్

‘‘ ఇప్పుడు కాంగ్రెస్ మ‌రింత‌గా దూకుడుగా మారుతుంది. మరింత చురుకైన కాంగ్రెస్ గా అవ‌త‌రిస్తుంది. ఎంతలా అంటే ఇక దాని రాజకీయ ప్ర‌త్య‌ర్థులు తేలిక‌గా తీసుకోలేని కాంగ్రెస్ గా మారుతుంది.’’ అని చెప్పారు.  కాంగ్రెస్ దేశంలోనే ప్రధాన రాజకీయ శక్తి అని, ఇది పురాతన రాజకీయ పార్టీ అని అన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చని, కానీ ప్రతీ ప్రాంతం, గ్రామం, పట్టణంలో తమకు చాలా స్ప‌ష్ట‌మైన ఉనికి ఉంది. ’’ అని జైరాం రమేష్ అన్నారు.

కాగా.. నిన్న (బుధవారం) ఉద‌యం ప్రారంభమైన పాదయాత్ర 13 కిలో మీటర్లు క‌వ‌ర్ చేసింది. కన్యాకుమారి నుంచి సుచింద్రం చేరుకోవడానికి ఆ పార్టీ నేత‌ల‌కు మూడు గంటల సమయం పట్టింది. ‘‘ ఇది తక్కువేం కాదు. మేము 13-15 కిమీ దూరం అంచనా వేశాం. మేము ఈ రోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించాము, CWC సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. రేపటి నుంచి ఉదయం పూట దాదాపు 15 కిలో మీటర్లు, సాయంత్రం 8 కిలో మీటర్లు పూర్తి చేయాలని ఆలోచ‌న ఉంది ’’ అని అన్నారు. 

డీఆర్డీవో చ‌రిత్రలో మ‌రో మైలు రాయి.. క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టూ ఎయిర్‌ మిస్సైల్ ప‌రీక్ష స‌క్సెస్

బీజేపీపై చేసిన విమర్శలపై రమేష్‌ను ప్రశ్నించగా.. ఇది భార‌త్ జోడో యాత్ర అని, బీజేపీ ఏం చెప్పినా ప‌ట్టించుకోన‌ని చెప్పారు. తాను కాంగ్రెస్ యాత్ర‌పైనే దృష్టి సారించాన‌ని పేర్కొన్నారు. తమ పార్టీ చేపట్టిన ఈ యాత్ర విష‌యంలో బీజేపీ ఎంత ఎక్కువ మాట్లాడితే, అది అంత ఉలిక్కిప‌డింద‌ని స్ప‌ష్టం అవుతోంద‌ని విమ‌ర్శించారు. త‌మ పార్టీ పటిష్టంగా ఉంటుందని తెలిపారు. 

కాగా.. ప్ర‌స్తుతం క‌న్యా కుమారిలో మొద‌లైన ఈ యాత్ర శ్రీనగర్‌లో ముగియనుంది. 150 రోజుల్లో 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను క‌వ‌ర్ చేయ‌నుంది. ఈ యాత్ర దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు దోహద‌ప‌డుతుంద‌ని హైక‌మాండ్ భావిస్తుంద‌. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో పాదయాత్ర‌లు చేపట్టింది. ప‌లు రాష్ట్రాల‌కు చెందిన నాయ‌కులు ఇందులో పాల్గొని పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి కృషి చేశారు. కానీ దేశ వ్యాప్తంగా ఇలా చేసిన సంద‌ర్భాలు లేవు. 2024 ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకొని ఈ యాత్ర చేపడుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios