మరో మైలురాయిని తాకిన భారత్ జోడో యాత్ర.. వంద రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర
భారత్ జోడో యాత్ర నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారిలో ఈ యాత్ర ప్రారంభమైంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మొదలైన ఈ యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలను చుట్టివచ్చింది. ప్రస్తుతం ఈ యాత్ర రాజస్థాన్ లో కొనసాగుతోంది.

కాంగ్రెస్ అధి నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర శుక్రవారం నాటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం ఈ యాత్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేసింది. ప్రస్తుతం ఈ యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతోంది.
కల్తీ మద్యం మృతులకు ఎలాంటి పరిహారం ఇవ్వం.. సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన
భారత్ జోడో యాత్ర దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీర్ వరకు దాదాపు ఐదు నెలల వ్యవధిలో 3,570 కిలో మీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారతదేశ చరిత్రలో ఏ భారతీయ రాజకీయ నాయకుడు ఇన్ని కిలో మీటర్లు పాదయాత్ర చేపట్టలేదని కాంగ్రెస్ పేర్కొంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభమైన పాదయాత్ర వచ్చే ఏడాది కాశ్మీర్‌లో ముగియనుంది.
ఈ యాత్ర పలు రాష్ట్రాల గుండా కొనసాగే సమయంలో సమయంలో ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రముఖులు, సినీ నటులు, ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు. ఇప్పటి వరకు పూజా భట్, రియా సేన్, సుశాంత్ సింగ్, స్వరా భాస్కర్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరి, అమోల్ పాలేకర్ వంటి సినీ, టీవీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు.
మాజీ నేవీ చీఫ్ అడ్మిరల్ ఎల్ రాందాస్, శివసేనకు చెందిన ఆదిత్య థాకరే, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే వంటి ప్రతిపక్ష నాయకులు, మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో పాటు రచయితలు వివిధ ప్రాంతాలలో ఈ మార్చ్ లో చేరారు. ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు, డిప్యూటీ ముఖేష్ అగ్నిహోత్రి, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
ఈ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘ భారత్ జోడో యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుంది. భారతీయ ప్రయాణికులందరికీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ జీ అభినందనలు. యాత్రకు లక్షలాది మంది ప్రజల మద్దతు, సహకారం, విశ్వాసం లభించింది. ఇది జాతీయ ప్రజా ఉద్యమం'’’ అని పేర్కొన్నారు.
పార్లమెంట్ మెట్లపై నుంచి జారిపడ్డ ఎంపీ శశిథరూర్.. నియోజకవర్గ పర్యటన రద్దు..
కాగా.. శుక్రవారం ఈ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉదయం కొద్దిసేపు రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. అయితే ఈ యాత్ర డిసెంబరు 24న ఢిల్లీలో ప్రవేశించనుంది. దాదాపు ఎనిమిది రోజుల విరామం తర్వాత ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ కు వెళ్లి చివరగా జమ్మూ కాశ్మీర్‌కు చేరనుంది.