Asianet News TeluguAsianet News Telugu

క‌ల్తీ మ‌ద్యం మృతుల‌కు ఎలాంటి ప‌రిహారం ఇవ్వం.. సీఎం నితీష్ కుమార్ సంచలన ప్రకటన‌ 

బీహార్‌లో క‌ల్తీ మ‌ద్యం సేవించి 50 మందికి పైగా మ‌ర‌ణించారు. అయితే.. క‌ల్తీ మ‌ద్యం సేవించి మృతి చెందిన వారికి ఎలాంటి ప‌రిహారం అందిచ‌బోమ‌ని సీఎం నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. మ‌ద్యం తాగితే మీరు మ‌ర‌ణిస్తార‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని, మ‌ద్యపానానికి అనుకూలంగా మాట్లాడిన వారెవ‌రూ మీకు ఎలాంటి మేలు చేయ‌ర‌ని పేర్కొన్నారు.

Bihar hooch tragedy: CM Nitish Kumar's 'no compensation' claim sparks row
Author
First Published Dec 16, 2022, 4:08 PM IST

బీహార్‌లో చ‌ప్రా,స‌ర‌న్ జిల్లాల్లో క‌ల్తీ మ‌ద్యం సేవించి  50 మందికి పైగా మ‌ర‌ణించారు. ఈ నేప‌ధ్యంలో మృతుల‌కు ఎలాంటి ప‌రిహారం అందిచ‌బోమ‌ని సీఎం నితీష్ కుమార్ స్ప‌ష్టం చేశారు. కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని బీజేపీ సభలో డిమాండ్ చేస్తుండగా.. రాష్ట్ర అసెంబ్లీలో శుక్ర‌వారం నాడు సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ.. మ‌ద్యం తాగితే.. మీరు మ‌ర‌ణిస్తార‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని, మ‌ద్యపానానికి అనుకూలంగా మాట్లాడిన వారెవ‌రూ మీకు ఎలాంటి మేలు చేయ‌ర‌ని మరోసారి పునరుద్ఘాటించారు.

ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వం - నితీష్ కుమార్

పరిహారం ఇవ్వబోమని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. నిషేధం లేని చోట కూడా మరణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వరు. ప్రజలు మద్యం సేవించకుండా ప్రచారం చేయాలి. మేము బాపు (మహాత్మా గాంధీ) బాటలో నడుస్తున్నాము. బిజెపి కూడా నిషేధానికి మద్దతు ఇచ్చింది. ప్రధానమంత్రి (పిఎం నరేంద్ర మోడీ) దానిని ప్రశంసించారు.మ‌ద్యపానానికి అనుకూలంగా మాట్లాడిన వారెవ‌రూ మీకు ఎలాంటి మేలు చేయ‌ర‌ని పేర్కొన్నారు.


కల్తీ మద్యం వల్ల మరణించిన వారిపై సానుభూతి లేదు

ఎవరు తాగినా చచ్చిపోతారని నితీశ్ కుమార్ మరోసారి పునరుద్ఘాటించారు. కల్తీ మద్యం వల్ల మరణించిన వారిపై ఎలాంటి సానుభూతి లేదు. కల్లీ మద్యం త్రాగేవారు. ఖచ్చితంగా చనిపోతారు.నిషేధం లేని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో కూడా కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ నిషేధానికి మద్దతిచ్చింది. ఏ మతంలోనైనా మద్యం సేవించడం సరికాదని అన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 58కి చేరింది. ఛప్రా జిల్లాలో కల్తీ మద్యం తాగి 53 మంది చనిపోగా, సివాన్‌లో 5 మంది మరణించారు. బీహార్‌లో మద్యం నిషేధించబడింది. 

 నితీష్ ప్రకటనపై సుశీల్ మోడీ తీవ్ర ఆగ్రహం 

బీహార్‌లో కల్తీ మద్యం సేవించి మరణించిన ఘటనలకు సంబంధించి బీజేపీ విధానసభ నుంచి రాజ్‌భవన్‌ వరకు పాదయాత్ర చేసింది. ఈ మరణాలకు నితీష్ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ సహా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విషపూరితమైన మద్యాన్ని తట్టుకోవడానికి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి సమీర్ మహాసేత్ గురువారం పేర్కొన్నారు. బీహార్‌లో నాసిరకం మద్యం వస్తోందని, దీంతో ప్రజలకు స్లో పాయిజనింగ్‌ వస్తోందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios