Asianet News TeluguAsianet News Telugu

ఏడుస్తున్న నా చిట్టితల్లి కడుపు నింపడానికి డబ్బుల్లేవు.. అందుకే చంపేశా..: ఆత్మహత్యాయత్నం చేసిన బెంగళూరు టెకీ

ఉద్యోగం కోల్పోయి, బిట్ కాయిన్ బిజినెస్ లాస్‌లతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన బెంగళూరు టెకీ తన బిడ్డను చంపేసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బిడ్డను గట్టిగా చాతికి అదుముకుని ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమెను పట్టుకునే ఓ సరస్సులో దూకాడు. కానీ, నీరు తక్కువ ఉండటంతో ఆ టెకీ మరణించలేదు.
 

bengaluru techie killed daughter who lost job and can not feed to crying daughter
Author
First Published Nov 27, 2022, 3:42 PM IST

న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల తన చిన్నారిని బెంగళూరు నుంచి శివారులోకి తీసుకెళ్లాడు. సరస్సు ఒడ్డున చిన్ని షాపులో ఆమెకు కొన్ని బిస్కెట్లు, చాక్లెట్లు తీసుకువచ్చి సంబురపెట్టాడు. ఆమె తిన్నది. ఆ వాహనంలోనే ఆమెతో కలిసి ఆడుకున్నాడు. తిరిగి ఇంటికి వెళదామనే అనుకుంటున్నాడు. కానీ, అప్పులు ఇచ్చినవారి వేధింపులు.. పోలీసు కేసు దర్యాప్తు గుర్తొచ్చి ఆగిపోయాడు. ఇంతలోనే ఆ చిన్నారి ఆకలి అంటూ ఏడ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక్క క్షణం జీవితం ఇక వ్యర్థం అనుకున్నాడు. ఇల్లు పీడకలగా వెంటాడింది.. ప్రేమగా చూసుకునే చిట్టితల్లి ఆకలి తీర్చలేని నిస్సహాయత ఇప్పటి వరకు సుడులు తిరుగుతున్న ఆత్మహత్య ఆలోచనే సరైనదని ఖరారు చేసింది. అంతే.. చిట్టితల్లిని ఒడిలోకి తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఎంతగా అంటే ఊపిరాడకుండా ఆమె మరణించేంతలా.. ఆమెను పట్టుకునే ఆ లేక్‌లో దూకేశాడు. అతను మునుగలేదు. ఆమె విగతజీవై పైకి తేలింది.

అప్పుల్లో కూరుకుపోయిన 45 ఏళ్ల టెకీ రాహుల్ పరమార్ స్టోరీ ఇది. ఆత్మహత్యాయత్నం చేసిన రాహుల్ పరమార్ పోలీసులకు చెప్పిన వివరాలివి. ఇటీవలే ఆయన ఉద్యోగం పోయింది.

Also Read: అమెరికాలో గుంటూరుకు చెందిన టెకీ మృతి.. ట్రెక్కింగుకు వెళ్లి..200 అడుగుల లోయలో పడి..

కూతురిని చంపేసిన అభియోగాలతో రాహుల్‌ను కోలార్ పోలీసులు అరెస్టు చేశారు. రాహుల్ కూతురు జియా డెడ్ బాడీ బెంగళూరు - కోలార్ హైవే సమీపంలోని కెండాటి సరస్సు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుది. క్రైమ్ రీకన్‌స్ట్రక్షన్ ప్రొసీజర్ కోసం రాహుల్‌ను మళ్లీ స్పాట్‌కు తీసుకెళ్లారు. దారి వెంటా రాహుల్ పొగిలి ఏడ్చాడు. నేరం ఎలా చేసింది వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యాడు. వెహికిల్ నుంచి దిగడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఏడ్చి ఏడ్చి కొంత కంట్రోల్ అయిన తర్వాత చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడే ఆ సరస్సు దగ్గరే తండ్రి వినోద్ పరమార్, భార్య భవ్యలు నిలబడి ఉండటాన్ని చూసి వచ్చే ఏడ్పును తమాయించుకోలేకపోయాడు. మళ్లీ ఏడ్చేసి బిడ్డను పొట్టనబెట్టుకున్నందుకు పశ్చాత్తాపపడుతున్నాని చెబుతూనే తనకు మరో దారి లేకుండా పోయిందని చెప్పినట్టు పోలీసువర్గాలు తెలిపాయి.

రాహుల్, జియాలు మిస్ అయినట్టు నవంబర్ 15వతేదీన భార్య భవ్య ఫిర్యాదు ఇచ్చింది. జియాను స్కూల్‌కు తీసుకెళ్లుతానని బయల్దేరిన రాహుల్ మళ్లీ వెనక్కి వెళ్లలేదు. ఆ తర్వాత రోజే జియా బాడీ కనిపించింది. రాహుల్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు.

గుజరాత్‌కు చెందిన ఈ టెకీ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. కానీ, ఇటీవలే ఉద్యోగం కోల్పోయాడు. బిట్‌కాయిన్ బిజినెస్‌లో నష్టాలతో ఆర్థిక సమస్యల ఊబిలో కూరుకుపోయాడు. భార్య దగ్గర నుంచి తీసుకున్న బంగారు ఆభరణాలు తన దగ్గర నుంచి చోరీ అయినట్టు పోలీసులకు నకిలీ ఫిర్యాదు ఇచ్చాడు. అప్పులు ఇచ్చిన వారు.. ఈ ఫేక్ కేసులో దర్యాప్తులతో రాహుల్ వేగలేకపోయాడు.

Also Read: సరదా కోసం డేటింగ్ యాప్ లింక్ నొక్కాడు.. న్యూడ్ చాట్ చేశాడు.. రెండేళ్లుగా నరకయాతన అనుభవించాడు...

ఉదయం నుంచి బెంగళూరు, కోలార్ మధ్య సూసైడల్ థాట్స్‌తో తిరుగుతూనే ఉన్నాడని, వెంట కూతురు ఉండటంతో ఆత్మహత్య నిర్ణయాన్ని స్పష్టంగా తీసుకోలేకపోయాడని రాహుల్ పోలీసులకు తెలిపాడు. గంటలు గడిచినకొద్దీ తనలో కన్ఫ్యూజన్ మొదలైందని అన్నాడు. చాలా సార్లు ఇంటికి తిరిగి వెళదామనే అనుకున్నట్టు తెలిపాడు. కానీ, అప్పులోళ్ల వేధింపులు, పోలీసు కేసులు నన్ను ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నట్టు వివరించాడు. సాయంత్రానికల్లా ఈ లేక్ బెడ్‌కు వెళ్లానని చెప్పాడు.

అక్కడే చిన్న షాపులో నుంచి చాకొలేట్లు, బిస్కెట్లు కొని బిడ్డకు తినిపించాడని, ఆమెతో చాలా సేపు సరదాగా కారు వెనుక సీటులో ఆడుకున్నానని వివరించాడు. ఆమెకు మళ్లీ ఆకలి కావడం, ఏడవడంతో బిడ్డ ఆకలి తీర్చడానికి చేతిలో ఒక్క రూపాయి లేదనే నిస్సహాయత మళ్లీ ఆవరించిందని తెలిపాడు. అప్పుడు బిడ్డను నా చాతికి తీసుకుని గట్టిగా హగ్ చేసుకున్నానని, ఆమె చనిపోయిన తర్వాత ఆమెను పట్టుకుని ఆ సరస్సులో దూకేశానని వివరించాడు. కానీ, ఆ లేక్‌లో వాటర్ తక్కువగా ఉండటంతో నేను మునగలేకపోయానని పేర్కొన్నాడు. ఓ ట్రైన్ ముందు దూకి ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యానని చెప్పాడు. అందుకే పాప బాడీని సరస్సులోనే విడిచి రోడ్డు వైపు వెళ్లానని, బంగార్పేట్ రైల్వే స్టేషన్‌ వద్ద డ్రాప్ చేయాలని ఓ బైక్ రైడర్‌ను అడిగానని పేర్కొన్నాడు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్లే ట్రైన్ ఎక్కానని తెలిపాడు.

Follow Us:
Download App:
  • android
  • ios