బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్మరేషన్ టెక్నాలజీ (ఐఐఐటీబీ)కి చెందిన 22 ఏళ్ల  ఆదిత్య అనే విద్యార్ధికి  గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టీమ్‌లో చోటు దక్కింది.

ఏడాదికి 1.2 కోట్ల రూపాయాల భారీ పారితోషకాన్ని ఆదిత్య  అందుకోనున్నారు. ముంబైకి చెందిన ఆదిత్య ఐఐఐటీ బెంగుళూరులో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తున్నాడు. 
గూగుల్‌ నిర్వహించిన ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ టెస్టులో ప్రపంచవ్యాప్తంగా 6 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు

.అయితే  సుమారు 50 మంది సెలెక్ట్ అయ్యారు. అయితే  చివరకు ఆదిత్య మాత్రమే సెలెక్టయ్యారు.. బెంగళూరు క్యాంపస్‌లో ప్రొవైడ్‌ చేసిన ఫెసిలిటీస్‌ వల్లే ఈ విజయం సాధించగలిగానని ఆదిత్య తెలిపారు.

ఈ నెల 16వ తేదీన ఆదిత్య న్యూయార్క్‌లో గూగుల్ టీమ్‌లో చేరుతారు. ఆదిత్యకు డ్రైవింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక ఆటల విషయానికి వస్తే క్రికెట్, పుట్ బాల్ ఆటలను వీక్షిస్తాడు.