Asianet News TeluguAsianet News Telugu

అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటున్న వెళ్లుతున్న దంపతులను వేధించిన పోలీసులు.. దర్యాప్తుకు ఆదేశం

బెంగళూరులో ఓ దంపతులు అర్ధరాత్రి వీధిలో నడుచుకుంటూ ఇంటికి వెళ్లుతూ ఉంటే దారి మధ్యలో పాట్రోల్ వ్యాన్‌లో వచ్చిన పోలీసులు హరాస్ చేశారు. రాత్రి 11 తర్వాత బయట తిరగకూడదనే రూల్ బ్రేక్ చేశారని, రూ. 3000 ఫైన్ కట్టాలని బెదిరించారని ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. చాలా సేపు వేధించారని, తన భార్య ఏడ్చేసిందనీ తెలిపాడు. దీనీపై బెంగళూరు టాప్ కాప్ రియాక్ట్ అయ్యారు.
 

bengaluru couple faced harassment by patrolling cops.. victim narrates his ordeal in twitter, top cop reacts
Author
First Published Dec 11, 2022, 2:09 PM IST

న్యూఢిల్లీ: ఆ రోజు సమీపంలోనే తెలిసినవారి బర్త్ డే పార్టీ ఉన్నది. ఆ బర్త్ డే పార్టీ అటెండ్ అయ్యాక భార్య, భర్త ఇద్దరూ నడుచుకుంటూ ఇంటికి తిరుగపయానం అయ్యారు. అర్ధరాత్రి దాటింది. మరికొన్ని అడుగుల దూరంలో ఇల్లు.. ఇంతలోనే ఓ పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది. వారిని ఐడీ కార్డులు చూపెట్టాలని పోలీసులు అడిగారు. ఫోన్‌లలో ఆధార్ కార్డులు చూపించారు. వెంటనే ఆ ఫోన్లు లాక్కున్నారు. ఫైన్ కట్టాలని ఆదేశించారు. ఎందుకు అని అడిగితే.. రాత్రి 11 గంటల తర్వాత రోడ్డుపై తిరగడం నిషేధం అని కొత్తగా మాట్లాడారు. అలాంటిదేమీ లేదని తెలిసి ఉన్నప్పటికీ గొడవ పెద్దది చేసుకోవడం ఇష్టం లేక.. తమన వదిలిపెట్టాలని ఆ దంపతులు పోలీసులను వేడుకున్నారు. అయినా వారిని కదలనివ్వలేదు. పోలీసుల హరాస్‌మెంట్‌తో ఆమె హడలిపోయి కన్నీరు పెట్టింది. భర్త కూడా తటపటాయిస్తున్నా చేసేదేమీ లేక నిస్సహాయంగా తమను వదిలిపెట్టాలని మాత్రమే బతిమిలాడాడు. చివరకు డబ్బులు తీసుకుని.. వార్నింగ్ ఇచ్చి పోలీసులు వారిని వదిలిపెట్టారు. ఈ ఘటన కర్ణాటకలో బెంగళూరు నగరంలో గురువారం అర్ధరాత్రి జరిగింది.

పోలీసుల వేధింపులకు గురైన ఆ వ్యక్తి ట్విట్టర్‌లో ఓ త్రెడ్ రూపంలో తాను ఎదుర్కొన్న సిచువేషన్ మొత్తం వివరించాడు. సహాయం కోసం బెంగళూరు సిటీ కమిషనర్ ఆఫ్ పోలీసును ట్యాగ్ చేశాడు. ఇందుకు సీపీ సానుకూలంగా స్పందించారు. ఆ పోలీసులను గుర్తించి యాక్షన్ తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీన్ని తమ దృష్టికి తెచ్చినందుకు ప్రశంసించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు పౌరులు తమను ఆశ్రయించాలని సూచించారు.

ట్విట్టర్‌లో కార్తిక్ పాత్రి తాను గురైన వేధనను ట్వీట్ల రూపంలో ఏకరువు పెట్టాడు. రాత్రి సుమారు 12.30 గంటలకు తాను తన భార్య ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి అటెండయ్యాక, కేక్ కటింగ్ తర్వాత నడుచుకుంటూ ఇంటికి బయల్దేరామని, తమ ఎంట్రెన్స్ గేట్‌కు కొన్ని మీటర్ల దూరంలో తాము ఉండగా ఓ ప్యాట్రోల్ వ్యాన్ వచ్చి ఆగిందని వివరించాడు. అందులో నుంచి ఇద్దరు పోలీసు యూనిఫామ్‌లో దిగారని, ఐడీ కార్డులు చూపెట్టాలని డిమాండ్ చేశారని వివరించాడు. తమను అక్కడే ఆపేసి.. సాధారణ రోజుల్లో కూడా రాత్రిపూట అడల్ట్ కపుల్ వీధిలో నడుచుకుంటూ వెళ్లితే ఐడీ కార్డులు ఎందుకు అడిగారు? అని ప్రశ్నించాడు.

Also Read: కస్టోడియల్ డెత్.. పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టిన స్థానికులు.. బుల్‌డోజర్‌తో ఇళ్లను నేలకూల్చిన అధికారులు

ఫోన్‌లలో ఆధార్ కార్డులు చూపిస్తే.. వాటిని కూడా లాక్కుని వ్యక్తిగత వివరాలు అడిగారని పేర్కొన్నాడు. కొంత తడబడ్డ వారి ప్రశ్నలకు మర్యాదగా సమాధానాలు చెప్పానని, మరో వ్యక్తి ఆధార్ కార్డు, తమ పేర్లతో చలాన్ రాస్తున్నట్టు కనిపించాడని తెలిపాడు. ఏదో ముప్పు రాబోతున్నదనే అనుమానంతో తమకు చలాన్ ఎందుకు ఇష్యూ చేస్తున్నారని అడిగానని, రాత్రి 11 తర్వాత రోడ్డుపై తిరిగి రూల్ బ్రేక్ చేశారని సమాధానం వచ్చిందని వివరించాడు. అలాంటి చట్టమేమీ లేదని తెలిసి ఉన్నప్పటికీ లేట్ నైట్, ఫోన్‌లు కూడా చేతిలో లేనందున పరిస్థితులు మరింత దిగజారకూడదనే ఉద్దేశంతో దాన్ని ప్రశ్నించలేదని పేర్కొన్నాడు.

అలాంటి చట్టం ఒకటి ఉన్నదని తెలుసుకోనందుకు వారు క్షమాపణలు చెప్పారని, తమను వదిలిపెట్టాలని అడిగితే.. రూ. 3000 పెనాల్టీగా కట్టి వెళ్లాలని డిమాండ్ చేసినట్టు పాత్రి తన ట్విట్టర్ త్రెడ్‌లో వివరించాడు. వారు కేవలం వసూలు చేయడానికి వచ్చారని, తాము బాధితులుగా చిక్కామని అనుకున్నామని తనకు అర్థం అయిందని పేర్కొన్నాడు. తమను వదిలిపెట్టాలని దాదాపు వేడుకున్నామని, అయినా వారు కనికరించలేదని, తాము ఎలా ప్రాధేయపడితే.. వారు అంతలా కఠినంగా మారుతున్నారని వివరించాడు. పెనాల్టీ చెల్లించకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారని తెలిపాడు.

Also Read: పోలీసు కస్టడీలో ఆర్మీ జవాను, ఆయన సోదరుడికి దారుణమైన టార్చర్, వేలు విరిచి తీవ్రంగా దాడి

తన భార్య ఏడవడం చూసి న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయని వారు తమ ట్రాక్ చేంజ్ చేశారని ఆయన వివరించాడు. తనను ఒక పోలీసు అధికారి పక్కకు తీసుకెళ్లి మినిమమ్ అమౌంట్ రూ. 1000 చెల్లించాని అడ్వైజ్ చేశారని, అది పేటీఎం ద్వారా చెల్లించమని పేటీఎం క్యూఆర్ కోడ్ చూపించాడని తెలిపాడు.

సీపీ ఈ ట్వీట్‌ను పరిగణనలోకి తీసుకుని ఇంకెవరైనా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటే తమను ఆశ్రయించాలని కోరారు. ఈ ఘటనను బయటకు తెచ్చినందుకు పాత్రికి నార్త్ ఈస్ట్ డివిజన్ డీసీపీ అనూప్ ఏ శెట్టి థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios