Asianet News TeluguAsianet News Telugu

పోలీసు కస్టడీలో ఆర్మీ జవాను, ఆయన సోదరుడికి దారుణమైన టార్చర్, వేలు విరిచి తీవ్రంగా దాడి

కేరళ పోలీసు కస్టడీలో ఆర్మీ జవాను, ఆయన సోదరుడు తీవ్రమైన టార్చర్ ఎదుర్కొన్నారు. పోలీసులు వారిని తీవ్రంగా దాడి చేసి ఆ తర్వాత ఎవరికి చెప్పొద్దని వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. లేదంటే ఇంట్లో డ్రగ్స్ పెట్టి వారి తల్లిని కేసులో ఇరికిస్తామని హెచ్చరించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
 

shocking case of custodial torture of army jawan and his brother in kerala creates uproar
Author
First Published Oct 21, 2022, 4:32 PM IST

తిరువనంతపురం: కేరళలో కస్టోడియల్ టార్చర్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ ఆర్మీ జవానును, ఆయన సోదరుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్న దారుణంగా టార్చర్ చేశారు. కిలికొల్లూర్ పోలీసు స్టేషన్‌లో జరిగిన ఈ వేధింపుల పై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ ఆందోళనల నేపథ్యంలో నలుగురు పోలీసులు అధికారుల పై సస్పెన్షన్ వేటు విధించారు. 

ప్రాథమిక విచారణ ప్రకారం, సోదరులు విష్ణు, విగ్నేష్‌లను కొందరు అధికారులు డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించి పోలీసు స్టేషన్‌లో దారుణంగా దాడి చేశారు. ఈ ఘటన కారణంగా కిలికొల్లూర్ పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వినోద్ కే, ఎస్‌ఐ అనీష్, ఏఎస్ఐ ప్రకాశ్ చంద్రన్, సివిల్ పోలీసు ఆఫీసర్ మనికందన్ పిళ్లైలను సస్పెండ్ చేశారు.

కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

ఎండీఎంఏ డ్రగ్ కేసులో అరెస్టు చేసిన ఓ నిందితుడికి బెయిల్ కోసం పోలీసులు కొల్లాంలోని పెరూర్‌కు చెందిన విగ్నేష్‌ను ఆగస్టు 25వ తేదీన సమన్లు పంపారు. పోలీసు స్టేషన్‌కు రమ్మని పిలిచారు. అది డ్రగ్స్ కేసు కావడంతో అక్కడికి వెళ్లలేదు. కేరల పోలీసు ఉద్యోగ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన డీవైఎఫ్ఐ సభ్యుడు కూడా.

విగ్నేష్‌ను పోలీసు స్టేషన్‌ దగ్గర పోలీసులు వెయిట్ చేయమని ఆదేశించారు. ఇంతలో విగ్నేష్ అన్న విష్ణు  తమ్ముడిని వెతుక్కుంటూ బైక్ పై స్టేషన్‌కు వచ్చాడు. ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న విష్ణు పెళ్లి సంబంధాల కోసం ఇంటికి వచ్చాడు. పోలీసు స్టేషన్ దగ్గర పార్కింగ్ ఇండికేటర్ వేయలేదు. దీంతో అక్కడే ప్లేన్ డ్రెస్‌లో ఉన్న ఏఎస్ఐ ప్రకాశ్ చంద్రన్ అతనిపై సీరియస్ అయ్యాడు. ఆ తర్వాత గొడవ జరిగింది. ఇందులో విష్ణు షర్ట్ పాకెట్ చినిగిపోయింది.

Also Read: తమిళనాడులో మరో లాకప్ డెత్.. రెండు నెలల్లో రెండో కేసు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

సదరు పోలీసు అధికారిపై కేసు పెట్టడానికి విష్ణు అదే పోలీసు స్టేషన్‌లోకి వెళ్లాడు. అక్కడ మరోసారి వారి మధ్య గొడవ జరిగింది. ఆ క్రమంలో ఆ ఏఎస్ఐ అధికారి తలకు బలమైన గాయమైందని తెలిసింది. పోలీసు అధికారిపై దాడి చేశారని విష్ణు వెంటనే అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు అన్నదమ్ములను స్టేసన్‌లో కొన్ని గంటలపాటు తీవ్రంగా కొట్టారు.

ట్రిగ్గర్ పుల్ చేయడానికి పనికి రాకుండా ఒక పోలీసు విష్ణు చూపుడు వేలిని విరిచేశాడని విగ్నేష్ చెప్పాడు. అనీష్ తన తలను కిందకి వంచి వెన్నెముకపై మళ్లీ మళ్లీ కొట్టాడని పేర్కొన్నాడు. తాగు నీరు అడిగినందుకు కప్‌లో మూత్రం పోసి ఇచ్చారని వివరించాడు. పోలీసుపై చేయి చేసుకున్నాడని, ఓ ఖైదీని బలవంతంగా బయటకు తీసుకెళ్లాలని ప్రయత్నించారనే ఆరోపణలతో కేసు పెట్టారు. 12 రోజులపాటు పోలీసు రిమాండ్‌లో ఉంచుకున్నారు.

ఆ తర్వాత వారిని విడుదల చేశారు. వారి గాయాలను ఎక్కడా చూపించవద్దని, ఎక్కడా వాటి గురించి మాట్లాడవద్దని వార్నింగ్ ఇచ్చి విడుదల చేశారు. లేదంటే, వారి ఇంట్లో డ్రగ్స్ పెట్టి తల్లిని డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని పోలీసులు హెచ్చరించినట్టు వారు చెప్పారు.

Also Read: తమిళనాడులో మరో లాకప్ డెత్.. రెండు నెలల్లో రెండో కేసు.. ఐదుగురు పోలీసులు సస్పెండ్

కొన్ని రోజులపాటు వారు ఆ కస్టోడియల్ టార్చర్ గురించి బయటికి చెప్పలేదు. కానీ, పోలీసులకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించారు. చికిత్స తీసుకోవడానికి ముందు వారి గాయాల ఫొటోలు తీయాల్సిందిగా వైద్యుడిని కోరినట్టు తెలిసింది. ఈ డాక్యుమెంటేషన్‌తో కేరళ టాప్ పోలీసు దగ్గరకు గురువారం వెళ్లారు. ఆ తర్వాతనే వారిపై దాడి చేసిన పోలీసులు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.

అయితే, పోలీసు శాఖ వారిని కాపాడుకునే ప్రయత్నం చేసినట్టు వివరించింది. వారి స్వగ్రామాలకు దగ్గరగా వారిని ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తెలిసింది. పోలీసులపై ప్రాథమిక విచారణలో అనేక లోపాలు ఉన్నట్టు వెలుగులోకి రావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు వచ్చాయి. ఫలితంగా వారిని సస్పెండ్ చేశారు.

కిలికొల్లర్ పోలీసు స్టేషన్‌లో తమను కస్టోడియల్ టార్చర్ చేసినదాంట్్లో ఐదుగురు పోలీసుల ప్రమేయం ఉన్నదని బాధిత కుటుంబం పేర్కొంది. పోలీసు శాఖలో చేరే అవకాశాన్ని విగ్నేష్ కోల్పోయాడు. విష్ణు వివాహం రద్దు అయింది.

Follow Us:
Download App:
  • android
  • ios