- Home
- Telangana
- Hyderabad Rains : వరదనీటిలో బతుకమ్మలైన కార్లు, ట్రక్కులు.. వాటర్ రెస్టారెంట్లుగా మారిన ఓల్డ్ సిటీ హోటల్స్..
Hyderabad Rains : వరదనీటిలో బతుకమ్మలైన కార్లు, ట్రక్కులు.. వాటర్ రెస్టారెంట్లుగా మారిన ఓల్డ్ సిటీ హోటల్స్..
లోతట్టు ప్రాంతాలలో తీవ్రమైన ప్రవాహం కారణంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక పాతబస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఓ రెస్టారెంట్ లోకి వరద నీరు చేరడంతో మడమల లోతు దాటిన నీటిలోనే రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహించింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

Hyderabad Rains
హైదరాబాద్ : నిన్న సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో రాత్రి 8:30 నుంచి 11 గంటల మధ్య 10-12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని ఫలితంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నీటితో వర్షపు నీటితో అనేక ప్రదేశాలలోకి ప్రవేశించాయి.
Hyderabad Rains
లోతట్టు ప్రాంతాలలో తీవ్రమైన ప్రవాహం కారణంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఇక పాతబస్తీలో వర్షం బీభత్సం సృష్టించింది. ఓ రెస్టారెంట్ లోకి వరద నీరు చేరడంతో మడమల లోతు దాటిన నీటిలోనే రెస్టారెంట్ కార్యకలాపాలు నిర్వహించింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.
Hyderabad Rains
ఇంకొన్ని వీడియోల్లో ఇంటిముందు పార్క్ చేసిన కార్లు నీటితో తేలుతూ కనిపించాయి. మరో చోట ఓ ట్రక్కు వరదనీటిలో కొట్టుకుపోతుంటే వీడియోలు తీశారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇరుకు గల్లీలు వరద నీటితో కాలువల్ని తలపించాయి.
hyderabad rains
సోషల్ మీడియాలో, నిరుడు సెప్టెంబర్-అక్టోబర్‌లో వరదలు సంభవించిన భయానక పరిస్థితులను నివాసితులు గుర్తు చేసుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా నగర పాలక సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో ఎలాంటి చొరవ తీసుకోలేదని వీరు ఆరోపిస్తున్నారు.
hyderabad rains
చింతలకుంటలో, ఒక వ్యక్తి ప్రవాహాలతో కొట్టుకుపోయాడు. తర్వాత అతను సురక్షితంగా దొరికాడు. అయితే, వనస్థలిపురంలో మరో ఇద్దరు తప్పిపోయినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. "భారీ వర్షాల కారణంగా ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోయారు. రెస్క్యూ టీం వారి కోసం వెతుకుతోంది" అని సీనియర్ పోలీసు అధికారి కె. పురుషోత్తం తెలిపారు.
hyderabad rains
సరూర్‌నగర్‌లోని లింగోజిగూడలో గరిష్టంగా 13 సెం.మీ వర్షం కురిసింది. దాదాపు గంటన్నరకు ఆగకుండా కురిసిన వానతో రోడ్లపై పెద్దఎత్తున flood water పోటెత్తింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్‌సిటీ, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, కుర్మగూడ తదితర ప్రాంతాల్లో వరద తీవ్రత అధికంగా కనిపించింది.
కుర్మగూడలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేట్ లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 13.68 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సరూర్ నగర్ మండలం లింగోజిగూడ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 13 సెంటీమీటర్లు, నందిగామ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 11.35 సెంటీమీటర్లు, మహేశ్వరం మండలం పారిశ్రామిక ప్రాంతంలో 9.03 సెంటీమీటర్లు, హయత్ నగర్ మండలం సౌత్ హస్తినాపురం ప్రాంతంలో 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది.