మహిళ మీద అత్యాచారం చేసిన తర్వాత మతం మార్చుకోవాలని నిందితులు ఒత్తిడి చేశారు. మతం మార్చడానికి మసీదుకు తీసుకెళ్లారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

ఘజియాబాద్ : ఘజియాబాద్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఫేస్ బుక్ లో పరిచయం అయిన మహిళ మీద ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఇస్లాం మతంలోకి మారాల్సిందిగా ఒత్తిడి తెచ్చాడు. సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫేస్‌బుక్‌లో నకిలీ పేరుతో నిందితులు తనను మోసం చేశారని మహిళ తెలిపింది. పరిచయంతో సన్నిహితంగా మారిన తరువాత కలవాలనుకుంటున్నానని ఆ వ్యక్తి చెప్పడంతో.. ఓ ప్రదేశంలో ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడ ఆమె మీద సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

కెనడాలో భారతీయ విద్యార్థి మృతి.. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలై...

ఘజియాబాద్ నివాసి అయిన మహిళ, ఆ తర్వాత తాను గర్భవతి అయ్యానని, అయితే ఆ వ్యక్తి బలవంతంగా అబార్షన్ చేయించాడని పేర్కొంది. ఆ వ్యక్తి పేరు ఖలీద్ అని, అతను తన మతం గురించి అబద్ధం చెప్పాడని అప్పుడే తెలిసిందని ఆమె చెప్పింది.

తన మతంలోకి మారాలని ఖలీద్ తనపై తీవ్రమైన ఒత్తిడి చేశాడని ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని ఓ మసీదుకు తీసుకెళ్లి బలవంతంగా మతమార్పిడి చేశాడని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ఖలీద్ తనని తాను జర్నలిస్టుగా చెప్పుకున్నాడని కూడా ఆ మహిళ చెప్పింది.

ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఖలీద్‌పై ఐపీసీ సెక్షన్లు 376, 313, 323, మరియు 509 కింద కేసు నమోదు చేశారు. తరువాత కలీద్ ను విజయ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు చేశారు.