కెనడాలో భారతీయ విద్యార్థి మృతి.. దుండగుల దాడిలో తీవ్రగాయాలపాలై...

కెనడాలో ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న 24 ఏళ్ల భారతీయ విద్యార్థిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేయడంతో మృతి చెందాడు. 
 

Indian student dies in Canada, during assaulted in deadly carjacking - bsb

కెనడా : ఓ భారతీయ విద్యార్థిపై కెనడాలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అతను మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గురువిందర్ నాథ్ (24) అనే యువకుడు ఒంటరియో ఫ్రాన్స్ లో పిజ్జా డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. జులై 9 వ తేదీన మిస్సిపాగా ప్రాంతంలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు అతని మీద దాడి చేసి, బైక్ లాక్కోడానికి ప్రయత్నించారని స్థానిక మీడియా కథనాలు.

ఆ వ్యక్తులు చేసిన దాడిలో గురువిందర్ తల, శరీర భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన వారు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స తీసుకుంటూ జులై 14 వ తేదీన మృతి చెందాడు. ఈ మేరకు  టొరంటోలోని భారత క్యాన్సిలేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. గురువిందర్ మృతి మీద కాన్సులేట్ జనరల్ సిద్ధార్థ్ నాథ్ మాట్లాడుతూ.. ‘ గురువిందర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.  ఆయన మృతి ఎంతో బాధాకరం’  అన్నారు. 

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్.. నెలవారీ ₹ 1,000 సహాయం అందించే పథకం ప్రారంభం

ఆయన మృతికి కారణమైన వారిని  త్వరలోనే గుర్తిస్తామని..  గురివిందర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని  సిద్ధార్థ నాథ్  హామీ ఇచ్చారు. స్థానిక పోలీసు అధికారి ఫిల్ కింగ్ మాట్లాడుతూ ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకున్నామని.. దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే, గురువిందర్ బండిని  దొంగతనం చేయాలనే ఆలోచనతోనే.. అతని మీద దాడి చేసిన నిందితులు పిజ్జా ఆర్డర్ చేసినట్లుగా విచారణలో తేలిందన్నారు పోలీసు అధికారి.   

గురువిందర్ మీద దాడి తర్వాత అతని వాహనాన్ని నిందితుల్లో ఒకరు తీసుకెళ్లారని గుర్తించినట్లుగా తెలిపారు. అతని వాహనాన్ని తీసుకుని పరారైన నిందితుడు ఘటన జరిగిన ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఆ వాహనాన్ని విడిచిపెట్టాడని దాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించామని.. ఆ రిపోర్టు వచ్చిన వెంటనే.. వీలైనంత త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

కాగా, కెనడాలో మృతి చెందిన గురువిందర్ మృతదేహాన్ని జూలై 27వ తేదీన భారత్ కు తరలించనున్నారు. కెనడాలో సొంతంగా పిజ్జా అవుట్ లైట్ ఓపెన్ చేయాలని గురువిందర్  అనుకున్నాడని.. ప్రస్తుతం అతను లాస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతలోనే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుందని స్నేహితులంటున్నారు.  కెనడాలోని 200 మంది భారతీయ విద్యార్థులు గురువిందర్ పై దాడిని ఖండిస్తూ, క్యాండిల్ లైట్ మార్చ్ తో నివాళి అర్పించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios