రుణం కావాలంటే కోరిక తీర్చాల్సిందే, రైతు భార్యకు బ్యాంక్ మేనేజర్ వేధింపులు

Bank manager seeks sexual favours from farmer's wife to pass loan
Highlights

బ్యాంక్ ప్యూన్ ద్వారా ఒత్తిడి...ఫోన్ చేసి కూడా...

నీ భర్తకు బ్యాంకు రుణం కావాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ బ్యాంక్ ఉద్యోగి వివాహితను వేధించాడు. ఆమెను లొంగదీసుకోడానికి సకల ప్రయత్నాలు చేశాడు. అయితే అతడి వేధింపులను ఆధారాలతో సహా బైటపెట్టి ఈ మహిళ మరేవరినీ ఇలా లైంగిక వేధించకుండా గుణపాఠం చెప్పింది. ఈ ఘటన మహారాష్ట్ర లో చోటుచేసుకుంది. 

మహారాష్ట్రలోని మల్కాపూర్ మండలంలోని ఓ సన్నకారు రైతు తనకు రుణం కావాలని సెంట్రల్ బ్యాంక్ ఆప్ ఇండియా శాఖకు  వెళ్లాడు. అయితే ఆ రైతు తనతో పాటు భార్యను కూడా బ్యాంకుకు తీసుకెళ్లాడు. ఈ సమయంలో రైతు భార్యను చూసిన బ్యాంక్ మేనేజర్ రాజేష్ ఆమెపై కన్నేశాడు.

సదరు రైతుకు మరింత సమాచారం కావాలంటూ అతడి భార్యకు సంబంధించిన వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.అప్పటి నుండి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. నీ భర్తకు రుణం మంజూరు చేయాలంటే కోరిక తీర్చాలంటూ అసభ్యంగా మాట్లాడేవాడు. పదేపదే ఫోన్ చేసి తనతో ప్రేమగా మాట్లాడాలంటూ బెదించేవాడు. అంతడితో ఆగకుండా బ్యాంక్ లో పనిచేసే ప్యూన్  ద్వారా ఆమెపై ఒత్తిడి తేవడం ఆరంభించాడు.

ఈ వేధింపులతో విసిగిపోయిన ఆమె తన భర్త సాయంతో మేనేజర్ ఫోన్ సంభాషణను రికార్డు చేసింది. అనంతరం ఈ ఆధారాలతో అతడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బ్యాంకు మేనేజర్ పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.  

  
 

loader