Asianet News TeluguAsianet News Telugu

ఫ్లైట్ లో మహిళా అటెండర్ ను కౌగిలించుకుని, ముద్దులు.. బంగ్లాదేశీ అరెస్ట్...

ముంబై మీదుగా వెడుతున్న మస్కట్-ఢాకా విమానంలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ప్రయాణం మధ్యలో మహిళా ఫ్లైట్ అటెండెంట్‌ను లైంగికంగా వేధించినందుకు 30 ఏళ్ల బంగ్లాదేశ్ వ్యక్తిని అరెస్టు చేశారు.

Bangladeshi man arrested for hugging and tries to kissing female attendant in flight, arrested - bsb
Author
First Published Sep 8, 2023, 2:11 PM IST

ముంబై : ముంబై మీదుగా ప్రయాణిస్తున్న మస్కట్-ఢాకా విమానంలో మహిళా ఫ్లైట్ అటెండెంట్‌ను లైంగికంగా వేధించినందుకు 30 ఏళ్ల బంగ్లాదేశ్ జాతీయుడిని అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు శుక్రవారం తెలిపారు.

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో విస్తారా విమానం ల్యాండ్ కావడానికి కొంత సమయం ముందు గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగిందని ఆయన చెప్పారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ దులాల్ అనే నిందితుడు విస్తారా విమానంలో మస్కట్ నుంచి ముంబై మీదుగా ఢాకా వెళ్తున్నాడు. 

కేరళ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ గెలుపు.. తండ్రి స్థానాన్ని కైవసం చేసుకున్న చాందీ ఊమెన్

విమానం ముంబైలో ల్యాండ్ కావడానికి అరగంట ముందు దులాల్ తన సీటు నుంచి లేచి ఓ మహిళ ఫ్లైట్ అటెండెంట్ ను కౌగిలించుకున్నాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు" అని ఆ అధికారి తెలిపారు. ఇతర క్యాబిన్ సిబ్బంది, ప్రయాణీకులు అది చూసి.. దాంట్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడు వారిని తోసేయడానికి ప్రయత్నించాడని అధికారి తెలిపారు. 

ఫ్లైట్ కెప్టెన్ మాటలు కూడా అతను వినలేదు. దీంతో అతనికి రెడ్ వార్నింగ్ కార్డ్ ఇచ్చాడు పైలెట్. అతడిని వికృత ప్రయాణీకుడిగా ప్రకటించారు. ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత, నిందితుడిని భద్రతా అధికారులకు అప్పగించారు. వారు అతన్ని సహర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

విమాన సహాయకురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సంబంధిత సెక్షన్ల కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతడిని స్థానిక కోర్టులో హాజరుపరచగా, శుక్రవారం వరకు పోలీసు కస్టడీ విధించినట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios