చైనా సీసీటీవీ కెమెరాలను నిషేధించాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి నినోంగ్ ఎరింగ్ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఆ కెమెరాల వల్ల సమాచారం మొత్తం చైనాకు తెలిసిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకోవాలని కోరారు. 

చైనా సీసీటీవీ కెమెరాలను బీజింగ్ కళ్లు, చెవులుగా ఉపయోగించుకోవచ్చని, వెంటనే వాటిని నిషేధించాలని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ పాసిఘాట్ వెస్ట్ ఎమ్మెల్యే, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మాజీ సహాయ మంత్రి నినోంగ్ ఎరింగ్ ప్రధానిని కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం లేఖ రాశారు. దీనిని ఆయన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘‘భారత ప్రభుత్వ కార్యాలయాల్లో చైనీస్ సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేయడాన్ని నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశాను. భారతదేశం అంతటా ఉపయోగంలో ఉన్న ఈ సీసీటీవీలను బీజింగ్ కళ్ళు, చెవులుగా ఉపయోగించవచ్చు’’ అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.

మందేసి, చిందేసి.. నాగుపాముకు ముద్దులు పెట్టి.. మెడలో వేసుకుని విన్యాసాలు చేస్తూ.. ఓ మందు బాబు వీరంగం... చివరిక

ఈ ముప్పును ఎదుర్కోవడానికి ప్రస్తుతం ఉన్న చట్టాలు, అవగాహన తగినంతగా లేనందున భారత జాతీయ భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని ఆయన నొక్కిచెప్పారు. ‘‘ ప్రస్తుత పరిస్థితుల్లో చైనా పదేపదే మన ఎల్ఏసీలపై మాత్రమే కాకుండా భారతదేశ ఐటీ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం ద్వారా శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, ఈ ముంచుకొస్తున్న చైనా ముప్పును అరికట్టడానికి భారతదేశం నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని స్పష్టమవుతోంది’’ అని ఆయన తన లేఖలో స్పష్టం చేశారు. 

Scroll to load tweet…

సీసీటీవీ నెట్ వర్క్ లలో తరచూ ఉపయోగించే ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) కెమెరాలు, ఇంటర్నెట్ తో నడిచే డిజిటల్ వీడియో రికార్డింగ్ (డీవీఆర్ ) పరికరాలు చైనా హ్యాకర్ల ఆపరేషన్ లో ఎలా హ్యాక్ అయ్యాయో ఆయన వివరించారు. అమెరికాకు చెందిన థ్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ఇచ్చిన నివేదికలో ప్రభుత్వ ప్రాయోజిత చైనా హ్యాకర్లు సైబర్ గూఢచర్యానికి పాల్పడుతున్నట్లు వెల్లడైందని ఆయన పేర్కొన్నారు.

షాకింగ్... యూ ట్యూబ్ లో చూస్తూ ప్రసవం చేసుకుని, నవజాతశిశువు గొంతు నులిమి చంపిన 15 యేళ్ల బాలిక.. !!

2022 జూన్ లో ప్రచురితమైన ఓ నివేదికలో ఉత్తర భారతదేశంలోని కనీసం ఏడు లోడ్ డిస్పాచ్ కేంద్రాలపై హ్యాకర్లు దృష్టి సారించారని నినోంగ్ ఎరింగ్ లేఖలో తెలిపారు. ‘‘లద్దాఖ్ లోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో గ్రిడ్ నియంత్రణ, విద్యుత్ పంపిణీ కోసం రియల్ టైమ్ ఆపరేషన్లు నిర్వహించడానికి ఇవి బాధ్యత వహిస్తాయి. భారతదేశం అంతటా 2 మిలియన్లకు పైగా సీసీటీవీలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో 90 శాతానికి పైగా చైనా ప్రభుత్వానికి చెందిన కంపెనీలు తయారు చేశాయని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. వీటిలో సగానికి పైగా భారత ప్రభుత్వ శాఖల్లోనే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం’’ అని అన్నారు. 

ఆ పార్టీల చర్చతో నాకు ప్రమేయం లేదు: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

అందువల్ల భారత ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా సీసీటీవీ వ్యవస్థల ఏర్పాటును వెంటనే నిషేధం విధించాలని తాను కోరుతున్నానని ఎమ్మెల్యే ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రజలు తమ ఇళ్లలో చైనీస్ సీసీటీవీలను ఉపయోగించకుండా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చని తెలిపారు. అవసరమైన చోట సీసీటీవీ డేటాను భద్రంగా ఉంచేందుకు స్వదేశీ క్లౌడ్ ఆధారిత సర్వర్ సొల్యూషన్ ను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని ఆయన సూచించారు.