యూ ట్యూబ్ లో చూస్తూ డెలివరీ చేసుకున్న ఓ 15యేళ్ల బాలిక పుట్టగానే నవజాత శిశువు గొంతు నులిమి చంపేసింది. ఆ తరువాత ఆ మృతదేహాన్ని ఇంట్లోని ఓ పెట్టెలో భద్రపరిచింది.
మహారాష్ట్ర : ఇటీవల కాలంలో యూట్యూబ్ లో చూస్తూ దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు వింటూనే ఉన్నాం. యూట్యూబ్లో చూసి బాంబులు తయారు చేయడం.. నాటు తుపాకుల తయారీ.. ఆత్మహత్యలు చేసుకోవడం.. ఇలా ఎన్నో రకాల విధ్వంసకరమైన విషయాలకు..యూట్యూబ్ ను వాడుతుండడం చూస్తూ ఉన్నాం. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ లో 15 ఏళ్ల బాలిక ఇలాంటి మరో దారుణానికి ఒడికట్టింది. యూట్యూబ్లో చూస్తూ పురుడు పోసుకుంది. ఆ తర్వాత పుట్టిన బిడ్డను అతికర్కశంగా గొంతు నులిమి చంపేసింది.
ఈ అమానవీయ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ స్థానిక అంబుజారి ప్రాంతంలో జరిగింది. ఈ ప్రాంతానికి చెందిన బాలికకు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పరిచయమయ్యాడు. ఆ తరువాత అతనికి ఆమె లైంగికంగా దగ్గర అయింది. దీంతో బాలికకు గర్భం వచ్చింది. అయితే వ్యక్తితో పరిచయం, అతనితో శారీరక సంబంధం… గర్భం రావడం లాంటి విషయాలు ఆమె తల్లిదండ్రులకు తెలియదు. బాలిక చెప్పలేదు. ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందనుకుందో ఏమో తెలియదు కానీ కుటుంబ సభ్యులకు తెలపలేదు.
అలా చేశాడని వెంబడించి.. ట్రక్ డ్రైవర్ పై ఆర్మీ సైనికుడు కాల్పులు.. పరిస్థితి విషమం..
అయితే, నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట పెద్దగా కనిపించడం మొదలు పెట్టడంతో తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ప్రశ్నించింది. కానీ ఆరోగ్య సమస్యతోనే అలా ఉంది అంటూ అమ్మాయి ఏ మార్చింది. కూతురు మీద ఉన్న నమ్మకంతో తల్లి కూడా అది నమ్మింది. ఈ క్రమంలోనే కాన్పు ఎలా చేసుకోవచ్చు యూట్యూబ్లో వీడియోలు చూడడం మొదలుపెట్టింది. అలా అందులో చూపించిన విధంగా మార్చి రెండవ తేదీన.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత పుట్టిన వెంటనే పసికొట్టు గొంతు నలిమి కర్కషంగా చంపేసింది.
ఈ విషయం ఇంట్లోనే కుటుంబ సభ్యులు గుర్తించకుండా ఉండాలని మృతదేహాన్ని ఇంట్లోనే ఓ పెట్టెలో దాచి పెట్టింది. ఇక పని మీద బయటకు వెళ్లిన తల్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి బాలిక తీవ్ర అనారోగ్య స్థితిలో ఉంది. విషయం అర్థం కాని తల్లి గట్టిగా బాలికను ప్రశ్నించడంతో.. తాను చేసిన పిచ్చి పని మొత్తం తల్లికి చెప్పేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లిన తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఇదిలా ఉండగా, 2021 సెప్టెంబర్ లో ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో ఒకటి వెలుగు చూసింది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో ఓ బాలిక (13), యూట్యూబ్ లో ఓ వీడియో చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకునిఆత్మహత్య చేసుకుంది. అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కోవిడ్ తో మృతి చెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. అయితే, ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు.
కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. బ్లేడ్, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో ఆ రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్ రూమ్ కు వెళ్లి బ్లేడ్ తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక అదే రోజు రాత్రి 11 గంటలకు మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
