బీహార్ లో ఓ మందుబాబు హల్ చల్ చేశాడు. మద్యం మత్తు తలకెక్కి.. నాగుపాముతో డ్యాన్సులేశాడు. అది కాటు వేయడంతో మృతి చెందాడు. 

బీహార్ : మద్యం అనేక విచిత్రాలు చేయిస్తుంది. ఆ మత్తు తలకెక్కిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో అనేక నేరాలకు పాల్పడడం కనిపిస్తూనే ఉంటుంది. మద్యం మత్తులో తనకు పగ ఉన్న వారిని చంపడం.. అత్యాచారాలకు పాల్పడడం.. నేరాలకు ఒడిగట్టడం తరచూ చూస్తుంటాం. ఈ క్రమంలోనే ఓ మందుబాబు పీకలదాకా మద్యం తాగిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఓ నాగుపాము కనబడితే దానిని మెడలో వేసుకుని ముద్దులు పెట్టాడు. విన్యాసాలు చేశాడు.

ఈ మందు బాబు చేసిన హడావుడికి.. పాము బెదిరిపోయింది.. మామూలుగానే మనిషి కనబడితే కాటు వేసే పాము.. ఇంత హంగామా చేసాక ఊరుకుంటుందా… ఆత్మరక్షణలో భాగంగా కసిదీరా కాటువేసింది. దీంతో సదరు మందుబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. బీహార్ లోని నవాద జిల్లాలోని గోవిందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే దిలీప్ యాదవ్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగాడు.

హోలీకి తీసుకెళ్లలేదని నా భార్య అలిగింది.. 10 రోజులు సెలవు కావాల్సిందే.. వైరల్ అవుతున్న ఇన్ స్పెక్టర్ లెటర్...

ఆ తర్వాత కామ్ గా ఇంట్లోకి వెళ్లి పడుకోకుండా అటుగా వెళుతున్న పామును పట్టుకొని మెడలో వేసుకున్నాడు. గుడి ముందుకు వెళ్లి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. తనను క్షమించమంటూ దేవుడిని కోరాడు. పామును మెడలో వేసుకుని కాసేపు చిందులేస్తూ హంగామా చేశాడు. కాసేపటికే కుప్పకూలిపోయాడు. తర్వాత అతడిని పాము కాటు వేసింది. ఇప్పటివరకు అతడి చేస్తున్న విన్యాసాలను చోద్యం చూసిన స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు ధృవీకరించారు.