హమాస్ పై పోరులో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని సైతం.. సైనికులతో కలిసి రంగంలోకి నఫ్తాలీ బెన్నెట్

ఇజ్రాయిల్ దళాలు హమాస్ మిలిటెంట్ గ్రూప్ తో పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ మాజీ ప్రధాని కూడా రంగంలోకి దిగారు. సైనికుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన క్షేత్రస్థాయికి వచ్చి పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

In the fight against Hamas, the former Prime Minister of Israel also entered the field with the soldiers, Naftali Bennett..ISR

ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడికి దిగిన పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి బాధిత దేశం ముందడుగు వేసింది. శనివారం హమాద్ దాడికి దిగగా.. తాము కూడా యుద్ధానికి సిద్ధమే అంటూ ఇజ్రాయెల్ ధీటుగా బదులిచ్చింది. గాజాలో ఆశ్రయం పొందుతున్న హమాస్ దళాలపై ఆదివారం నుంచి యుద్ధం చేస్తోంది. దీంతో వారు కూడా ఎదురుకాల్పులకు దిగారు. దీంతో ఇరు వైపులా కాల్పులు జరుగుతున్నాయి.

హమాస్ ఈ యుద్ధం తీవ్రతరం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఒకరు కూడా నేరుగా యుద్ధరంగంలోకి దిగారు. రిజర్వ్ డ్యూటీకి వచ్చిన మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ ఇజ్రాయెల్ సైనికులను కలిశారు. వారిలో ధైర్యం నింపారు. హమాస్ లపై పోరాడుతున్న సైనికులతో కరచాలనం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా.. హమాస్ తో పోరాడుతున్న ఇజ్రాయెల్ కు అమెరికా వెన్నుదండుగా నిలిచింది. బాధిత దేశానికి సాయం చేసేందుకు యుద్ధ నౌకలు, విమానాలను పంపించింది. అధ్యక్షుడు  జో బైడెన్ ఆదేశాలతో విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్, దాని వెంట ఉన్న యుద్ధనౌకలను తూర్పు మధ్యధరా ప్రాంతానికి పంపుతున్నామని అమెరికా డిఫెన్స్ విభాగం ‘పెంటగాన్’ తెలిపింది. నౌకలు, విమానాలు తమ కొత్త స్థావరాలకు కదలడం ప్రారంభించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఆదివారం మధ్యాహ్నం ధృవీకరించింది.

కాగా.. ఇజ్రాయెల్ పై హమాస్ దళాలు జరిపిన హింసలో అనేక మంది అమెరికా దళాలు మరణించారని వైట్ హౌస్ ప్రకటించింది. దీంతో అమెరికా బాధిత దేశానికి వేగంగా మద్దతు ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. ఘర్షణ నుండి దూరంగా ఉండాలని ఇతర పార్టీలను హెచ్చరించింది. బైడెన్ ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారని వైట్ హౌస్ పేర్కొంది. ఇజ్రాయెల్ రక్షణ దళాలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు యుద్ధనౌకలు, విమానాలు పంపిస్తున్నామని, రాబోయే రోజుల్లో మరింత సాయం చేస్తామని చెప్పారని తెలిపింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios