అయోధ్యలో బాబ్రీ మస్జీద్ కూల్చివేత కేసులో మరికాసేపట్లో సుప్రీమ్ కోర్టు తన తీర్పునువెలువరించింది. 28 సంవత్సరాలుగా వివాదాస్పదమైన రామజన్మభూమి స్థలంలోని మస్జీద్ ని కూలగొట్టిన కేసులో లక్నో స్పెషల్ కోర్టు తుది తీర్పును ఇచ్చింది 

ఈకేసులో సరైన ఆధారాలు లేనందున ఇది కుట్ర కాదు అని, కోర్టు సంచలన తీర్పు చెప్పింది. దీనితో ఈ కేసులో అద్వానీ సహా మిగిలిన  కరసేవకులందరికి ఊరట లభించనుంది. 

ఈ కేసుకు సంబంధించి సాక్షాధారాలు బలంగా లేనందున ఇది ఉద్దేశపూర్వక చర్యగా తేల్చలేకపోతున్నామని కోర్టు పేర్కొంది. నిందితులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. 

కోర్టుకు 26 మంది నిందితులు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎస్కే యాదవ్ 2000 పేజీల తీర్పు చదువుతున్నారు. హెడ్ కౌంట్ ముగిసిన తర్వాత న్యాయమూర్తి తీర్పును చదవడం ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అద్వానీ సహా ఆరుగురు నిందితులను విచారించారు. నిందితులను, న్యాయవాదులను మాత్రమే కోర్టులోకి అనుమతించారు. కేసులో 48 మందిపై అభియోగాలు మోపారు. వీరిలో 17మంది విచారణ క్రమంలో మరణించారు.

ఈ కేసుకు సంబంధించి 32 మంది నిందితుల్లో  26 మంది కోర్టులో ఉన్నారు. అద్వానీ, ఉమాభారతి, మురళి మనోహర్ జోషి, కళ్యాణ్ సింగ్ లు కోర్టులో లేరు. ఉమా భారతి కోప్రొటాన్ బారిన పడి చికిత్స పొందుతుండగా, కళ్యాణ్ సింగ్ కోలుకుంటున్నారు. జోషి, అద్వానీలు వార్ధక్యం కారణంగా హాజరు నుండి మినహాయింపు పొందారు.