దేశంలో భక్తి ముసుగులో బాబాల అకృత్యాలు పెరిగిపోతుండటం.. శిష్యురాళ్లు, భక్తురాళ్లపై స్వామిజీలు అత్యాచారాలకు పాల్పడుతుండటంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. శని ధామ్ ఆశ్రమంలో ధాటి బాబా తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ పెట్టిన కేసుపై మీడియా బాబా రాందేవ్‌ను మీడియా ప్రశ్నించగా..  తప్పుడు పనులు చేసే బాబాలను ఉరి తీయాలని ఆయన అన్నారు..

తమను దేవుళ్లుగా చెప్పుకునే బాబాలు.. హద్దు మీరితే జైళ్లకు పంపడం మాత్రమే కాదని.. ఉరి తీసి చంపేయాలని రాందేద్ కోరారు.. కాషాయ దుస్తులు ధరించినంత మాత్రాన అందరూ ఆధ్యాత్మిక గురువులు కాదు.. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఉద్యోగానికి ప్రోటోకాల్ ఉంటుంది.. బాబాల విషయంలోనూ కొన్ని పరిమితులు ఉంటాయి.. వాటిని ఎవరైనా సరే పాటించి తీరాల్సిందేనన్నారు.